ఏ ముహూర్తాన మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివకి ఒకే చెప్పి సినిమా చేస్తానన్నారో అప్పటి నుండే సినిమాకి అన్నీ ఒడిదుడుకులే ఎదురవుతున్నాయి. అవును సినిమా ఈపాటికే షూటింగ్ కూడా పూర్తవ్వాలి. కానీ కొన్ని అడ్డంకుల వల్ల డిలే అవుతూ వస్తుంది. సైరా షూటింగ్ టైంలోనే 'ఆచార్య' కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. కానీ సైరా షూట్ ఆలస్యం అవ్వడంతో కొరటాల చిరు కోసం చాలా నెలలు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఇక అంతా ఒకే అనుకోని షూటింగ్ మొదలెట్టారు. అప్పటి నుండి మేకింగ్ నత్తనడక న సాగుతుంది. అందుకే చిరు 'సరిలేరు నీకెవ్వరు' ఈవెంట్ లో కొరటాల శివ కి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వంద రోజుల్లోపే సినిమా ఫినిష్ చేయాలని అన్నారు. వేదికపై ఉండటంతో శివ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అన్నారు.
కానీ ఇపుడు పరిస్థితి చూస్తుంటే అనుకున్న డేట్స్ కంటే ఎక్కువ షూటింగ్ డేసే అవుతుంది. మొన్నటి వరకూ సినిమాలో స్పెషల్ రోల్ కోసం తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు చరణ్ తో రోల్ చేయించాలని డిసైడ్ అయ్యారు. వెంటనే మేకర్స్ కి సినిమా నుండి తప్పుకొని షాక్ ఇచ్చింది త్రిష. ఆ వెంటనే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఇలా ఆచార్య కి అన్నీ అడ్డంకులే మరి ఇవన్నీ దాటి సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఫైనల్ గా ఎప్పుడు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.