బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఒక తెరిచి ఉంచిన పుస్తకం. అభిమానులకు ఆయన గురించి తెలియని విషయాలేవీ లేవు. చిన్న వయస్కుడిగా ఉన్నప్పుడే డ్రగ్స్ కి బానిసై చెడు మార్గంలో వెళ్లడం .. ఆ తర్వాత పెద్ద స్టార్ గా ఎదగడం.. ఇటీవల ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకోవడం ఇవన్నీ తెలిసినవే.
అతడి జీవితంపై సంజు అనే మూవీ కూడా తీశారు. సంజయ్ దత్ మాదకద్రవ్యాలకు ఎలా బానిసయ్యాడు? అతను పూర్తిగా ఇ అలవాటు నుండి ఎలా బయటపడ్డాడనే దానిపై సినిమా తీశారు.
సంజయ్ దత్ డ్రగ్స్ అలవాటుపై కుమార్తె త్రిషాలా దత్ స్పందించారు. ఓ ఇన్ స్టాగ్రామ్ చాట్ లో అమెరికాకు చెందిన మానసిక వైద్యుడు త్రిషాలతో ముచ్చటించారు.
మాదకద్రవ్యాలు ఒక వ్యసనపరుడిగా ఎలా మారుస్తాయి? మనిషిని ఆ అలవాటు ఎలా చంపగలదు? అన్నది త్రిషాల వివరించారు. ``నా తండ్రి తన గత మాదకద్రవ్యాల అలవాటు పడినా కోలుకున్నారు. నాన్న ఇకపై ఉపయోగించకపోయినా ప్రతిరోజూ పోరాడవలసిన వ్యాధి ఇది. నా తండ్రి సమస్య ఉందని ఒప్పుకోవడం.. చొరవ తీసుకోవడం.. దాని నుంచి బయటపడేందుకు సహాయం కోరినందుకు నేను గర్వపడుతున్నాను. దీని గురించి సిగ్గుపడటానికి ఏమీ లేదు`` అని త్రిషాల దత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
సంజయ్ దత్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. కెజిఎఫ్: చాప్టర్ 2 కోసం చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ పాన్ ఇండియన్ మూవీ విడుదల కానుంది.