త్రివిక్ర‌మ్ ఆ హీరోతో మ‌రో సారి మాయ చేస్తాడ‌ట‌?

Update: 2022-11-11 02:30 GMT
మాట‌ల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో  ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. పుష్క‌ర కాలం త‌రువాత వీరిద్ద‌రు కలిసి SSMB28 కోసం ప‌ని చేస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. లాంఛ‌నంగా పూజా కార్య‌క్రమాలు జ‌రుపుకున్నఈ మూవీ మూడు నెల‌ల త‌రువాత అంటే సెప్టెంబ‌ర్ 12న సెట్స్ పైకి వెళ్లింది.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన త‌రువాత బ్రేకిచ్చారు. ఇదే స‌మ‌యంలో మ‌హేష్ మ‌ద‌ర్ ఇందిరా దేవి మృతి చెంద‌డంతో సెకండ్ సెడ్యూల్ కు మ‌రింత బ్రేక్ ప‌డింది. ఇటీవ‌ల వెకేష‌న్ కోసం మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్ వెళ్లి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. పూజా హెగ్డే కాలికి గాయం కావ‌డంతో త‌దుప‌రి షెడ్యూల్ ని డిసెంబ‌ర్ లో ప్రారంభించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత త్రివిక్ర‌మ్ మ‌రో సారి అల్లు అర్జున్ తో క‌లిసి ఓ భారీ సినిమా చేయ‌నున్నాడ‌ట‌.

గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, `అల వైకుంఠ‌పుర‌ములో` వంటి మూడు  సినిమాలు రూపొందాయి. ఇందులో `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో భారీ డిజాస్ట‌ర్ ని ద‌క్కించుకున్న బ‌న్నీని మ‌ళ్లీ  `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీతో స‌క్సెస్ బాట ప‌ట్టించారు త్రివిక్ర‌మ్‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి నాలుగ‌వ సారి క‌లిసి ప‌ని చేయ‌బోతున్నార‌ట‌.

`పుష్ప 2` షూటింగ్ గురువారం మొద‌లైంది. ఈ మూవీ త‌రువాత అల్లు అర్జున్ .. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో క‌లిసి ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పటికే దీనికి బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాది మిడ్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఆ త‌రువాతే త్రివిక్ర‌మ్ తో చేయాల‌నుకుంటున్న సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న బ‌న్నీ - త్రివిక్ర‌మ్ నాల‌గ‌వ సారి ఏ స్థాయి సినిమాని తెర‌పైకి తీసుకురానున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News