మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దాదాపుగా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా శాటిలైట్ ప్రేక్షకులను ఇప్పటికి కూడా అలరిస్తూనే ఉన్నాయి. అందుకే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబో అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి.
మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఆ గొప్ప అవకాశం త్రివిక్రమ్ కు దక్కింది. కాని ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కాదు కదా కనీసం ఒక మోస్తరుగా కూడా వసూళ్లను దక్కించుకోలేక పోయాయి. ఖలేజా సినిమా మహేష్ కెరీర్ లోనే చెత్త సినిమాల జాబితాలో ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.
రెండు సార్లు నిరాశ పర్చినా కూడా మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ కు అవకాశం ఇచ్చాడు అంటే అది కేవలం అభిమానుల డిమాండ్ తోనే అనడంలో సందేహం లేదు. వీరిద్దరి కాంబో మూవీ వచ్చి పుష్కర కాలం దాటింది. ఈ సమయంలో మహేష్ బాబు స్టార్ డమ్ లో మరియు త్రివిక్రమ్ టేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. కనుక ఈసారి మహేష్ బాబుకు ఖచ్చితంగా త్రివిక్రమ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
త్రివిక్రమ్ సినిమా అంటే భారీ సెంట్టింగ్ లు ఉంటాయి. అత్తారింటికి దారేది సినిమాలో అత్త ఇంటి సెట్టింగ్ ను అత్యంత భారీగా వేయించాడు. అల వైకుంఠపురంలో సినిమా కోసం కూడా టబు ఇంటి సెట్టింగ్ ను భారీగా వేయించాడు. ఇక ఇతర సినిమాల కోసం కూడా త్రివిక్రమ్ భారీగానే ఖర్చు చేసి ఒక సెట్టింగ్ ను వేయించడం మనం చూశాం. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నాడట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక అత్యంత విలాసవంతమైన ఇల్లు సెట్టింగ్ ను త్రివిక్రమ్ వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో మెజార్టీ సన్నివేశాలు ఆ సెట్టింగ్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అందుకే మహేష్ బాబు అభిరుచికి తగ్గట్లుగా.. ఆయన స్టార్ డమ్ కు తగ్గట్లుగా ఈ సెట్టింగ్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించాడని సమాచారం అందుతోంది.
జూన్ నెలలో సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి.. ఆ హడావుడి పూర్తి అయిన తర్వాతే త్రివిక్రమ్ తో కలవాలని మహేష్ బాబు భావిస్తున్నాడు అంటున్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభించినా కూడా ఎక్కువ రోజులు తీసుకోకుండా 70 నుండి 80 వర్కింగ్ డేస్ లోనే సినిమాను పూర్తి చేస్తానంటూ త్రివిక్రమ్ హామీ ఇచ్చాడట. త్రివిక్రమ్ సినిమా తర్వాత వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.