మహేష్ కోసం త్రివిక్రమ్ న్యూ హౌస్!

Update: 2022-12-08 00:30 GMT
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న SSMB 28వ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ తొందరగానే సెట్ అయినప్పటికీ కూడా ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి. మహేష్ బాబు మొదటి కథను కాదని మరొ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన ఈ ప్రాజెక్టు మళ్ళీ సెట్స్ పైకి రావడానికి చాలా ఆలస్యమైంది.

ఇక ఇప్పుడు మొదటి షెడ్యూల్ మరోసారి మొదలుపెట్టబోతున్నారు.  హైదరాబాదులోనే ఒక భారీ సెట్ నిర్మాణానికి ప్లాన్ కూడా సిద్ధమయింది. అయితే ఇది వరకే ఈ స్థలంలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించిన భారీ సెట్ ను కూడా నిర్మించారు. ఇప్పుడు అదే స్థలంలో మహేష్ బాబు సినిమా కోసం ఒక అతిపెద్ద ఇంటిని నిర్మించబోతున్నారు.

అంతేకాకుండా మరొక రెండు సెట్లు కూడా త్వరలోనే రెడీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాల్లో కూడా సెట్స్ వర్క్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

ముఖ్యంగా ఇంటి నిర్మాణం అయితే ఆయన మొదటి సినిమాలో నుంచి కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అత్తారింటికి దారేదిలో సునంద హౌస్ అలాగే సన్నాఫ్ సత్యమూర్తి లో దేవరాజ్ ఇల్లు అ ఆ సినిమాలో ఆనంద్ విహారి ఇల్లు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక అలవైకుంఠపురంలో సినిమాలో ఇంటి నిర్మాణం  సినిమాలో మరింత హైలెట్ అయ్యే విధంగా చూపించారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా అదే తరహాలో త్రివిక్రమ్ తన మార్క్ కు తగ్గట్టుగా ఒక అందమైన ఇంటిని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే మహేష్ బాబు కామెడీకి టైమింగ్ కూడా హైలెట్ కాబోతుందట. మరి మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News