ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' భారీ విజయం సాధించింది. ఈమధ్యే చిత్ర బృందం ఒక సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి త్రివిక్రమ్ ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "అందరు హీరోలు అల వైకుంఠపురములో సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ క్లోజ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను చూశారా? ఒకవేళ చూస్తే ఏమన్నారు?" అని అడిగితే త్రివిక్రమ్ సరదాగా బదులిచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారని.. ఈ టైమ్ లో ఆయన సినిమాలు చూడరని అన్నారు. అసలు పవన్ తన సినిమాలనే చూసుకోరని.. ఎప్పుడో మూడు నెలల తర్వాత చూసుకోవాలనిపిస్తే చూస్తారని అన్నారు. తను ఎంతో బ్రతిమాలితే 'అత్తారింటికి దారేది' రిలీజ్ అయిన 120 రోజుల తర్వాత చూశారని చెప్పారు. ఇక 'అల వైకుంఠపురములో' సినిమాను మూడు నెలల లోపు చూడాలంటే అద్భుతం జరగాలని సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పవన్ చెప్పిన పనులు అసలు చెయ్యరని.. సినిమాలు ఇకపై చెయ్యను అని చెప్పి ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నారని.. ఇప్పుడు సినిమాలు చూడరు అంటే చూస్తారని అర్థమని అంటున్నారు. కొందరేమో.. బన్నీ చెప్పను బ్రదర్ తరహాలో అల వైకుంఠపురములో సినిమాను పవన్ 'చూడరు బ్రదర్' అంటూ త్రివిక్రమ్ డైలాగ్ ను మార్చి చెప్తున్నారు. అంతే కాదు.. "నందమూరి బాలకృష్ణ కూడా 'నాన్నగారి' సినిమాలు తప్ప మరేవీ చూడరని.. దీంతో 'రూలర్' లు వచ్చి బాక్స్ ఆఫీసును బెదరగొడుతున్నాయి. మీ ఫ్రెండ్ పవన్ గారిని ఇప్పటికైనా సినిమాలు చూడమని చెప్పండి.. లేకపోతే అలానే జరిగే ప్రమాదం ఉంది" అని కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.