త్రివిక్రమ్ సెకండ్ హీరో సెంటిమెంట్.. మహేష్ మూవీకి వర్కౌట్ అయ్యేనా?
త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురంలో సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కాంబోను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెట్ చేశాడు.
మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా చేస్తే చూడాలని సినీ వర్గాల వారి నుండి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే కాకుండా సెకండ్ హీరో మరియు హీరోయిన్ కూడా ఉన్న విషయం తెల్సిందే.
ఆ సెంటిమెంట్ ను మహేష్ బాబు సినిమాకు కూడా అనుసరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే ను ఎంపిక చేయడం జరిగింది. సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను శ్రీలీల ను ఎంపిక చేశారు. ఇప్పుడు సెకండ్ హీరో పాత్రకు గాను యంగ్ హీరో సాయి రోనాక్ కి ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి.
సాయి రోనాక్ తెలుగు లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా మంచి పేరు దక్కించుకోవడంతో పాటు గుడ్ లుకింగ్ అనిపించుకున్న ఈ యువ హీరోకు త్రివిక్రమ్ టీమ్ నుండి పిలుపు అందింది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తో సినిమాలో నటించే అవకాశం రావడం అంటే కచ్చితంగా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు సాయి రోనాక్ గురించి మాట్లాడుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.