నందమూరి వారికి కూడా మాట ఇచ్చిన త్రివిక్రమ్‌

Update: 2018-10-24 13:34 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత’ చిత్రంతో మరో మాంచి హిట్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. మాటలతో అందరిని కట్టి పడేసే త్రివిక్రమ్‌ చిత్రాలన్నీ కూడా చాలా వరకు సక్సెస్‌ అవుతాయి. దాంతో వివిధ నిర్మాణ సంప్థలు త్రివిక్రమ్‌ సినిమాలను నిర్మించడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తాయి. ఇటీవల త్రివిక్రమ్‌ ఎక్కువగా హారిక హాసిని బ్యానర్‌ లోనే సినిమాలను చేస్తున్నాడు. త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం కూడా ఇదే బ్యానర్‌ లో రూపొందుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటికే త్రివిక్రమ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ మరియు డివివి దానయ్యలకు సినిమాలను చేస్తానని మాట ఇచ్చాడట. అయితే ఆ బ్యానర్‌లలో ఎప్పుడు చేస్తాడు అనే విషయం క్లారిటీ లేదు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తాజాగా మరో నిర్మాణ సంస్థకు కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ యొక్క నిర్మాణ సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌ పై ఒక చిత్రాన్ని చేయడానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అంతేకాకుండా పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడనే టాక్‌ వస్తుంది.

నందమూరి బ్యానర్‌ లోని ప్రాజెక్ట్‌ ఎప్పుడూ అనేది త్రివిక్రమ్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదట. నందమూరి బ్యానర్‌ లో తెరకెక్కే చిత్రంలో హీరోగా కళ్యాణ్‌ రామ్‌ - ఎన్టీఆర్‌ లు కాకుండా వేరే హీరో అయినా ఉండే ఛాన్స్‌ ఉంది. ఏ హీరోతో అయినా ఒక ప్రాజెక్ట్‌ చేయడానికి త్రివిక్రమ్‌ కళ్యాణ్‌ రామ్‌ కు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News