రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''లైగర్''. ఇందులో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా 'లైగర్' థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించనున్నారు. అలానే గురువారం హైదరాబాద్ - ముంబై లలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌన్ ని ఏర్పాటు చేశారు.
75 అడుగల ఎత్తున్న ఈ కటౌట్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ అవతారంలో సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తూ అర్థనగ్నంగా కనిపించాడు. ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడీ అభిమానులు ఈ కటౌట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. కొంతమంది నెటిజన్స్ మరియు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.
అది కటౌట్ లా లేదని.. కట్ డ్రాయర్ యాడ్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ కటౌట్ ని ఎడిట్ చేసి విజయ్ దేవరకొండ ఫోటోకి పంచె కట్టు - బనియన్ తొడిగించి.. నెత్తిన తలపాగ పెట్టి 'సౌత్ ఇండియా లైగర్' అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇటీవల రిలీజైన విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపైనా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇందులో VD ఒంటి మీద ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం గులాబీ గుచ్చాన్ని అడ్డుగా పెట్టుకొని కనిపించాడు. సర్వస్వం అర్పించడం అంటే బట్టలు కూడా ఇచ్చేయడమేమో అని కామెంట్స్ చేశారు.
సంపూర్ణేష్ బాబు క్యాలీ ప్లవర్ అడ్డు పెట్టుకొని అసెంబ్లీ ముందు నిలబడితే.. ఇక్కడ విజయ్ గులాబీలను అడ్డుపెట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడని ట్రోల్ చేశారు. మరికొందరు ఈ బోల్డ్ పోస్టర్ ని ఎడిట్ చేసి ప్యాంటు ధరించినట్లు రెడీ చేసాడు. దీన్ని విజయ్ స్పోర్టివ్ గా తీసుకొని 'సకాలంలో ఆదుకునే బ్రదర్ నువ్వే' అని సమాధానమిచ్చాడు.
ఇప్పుడు 'లైగర్' కటౌట్ పైనా ట్రోల్స్ వస్తున్నాయి. ఇదంతా పరోక్షంగా సోషల్ మీడియాలో సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చి పెడుతోంది. అలానే సినిమా కోసం దేనికైనా రెడీ అనే విజయ్ దేవరకొండ ధైర్యాన్ని సూచిస్తోంది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో 'లైగర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ MMA బాక్సర్ గా కనిపించనున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లేదా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనబోయే ఫైటర్లు ఇలానే సెమీ న్యూడ్ డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతుంటారు.
బాక్సింగ్ లీగ్స్ ను ఫాలో అయ్యే వారికి దీనిపై ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. అందుకే ఇప్పుడు VD కూడా అలా కనిపిస్తున్నాడు. ఇందులో ట్రోలింగ్ చేయాల్సిన విషయమేమీ లేదు. ఇంకా సినిమా కోసం అంత డేర్ గా అర్థనగ్న ఫోటోలను షేర్ చేసినందుకు రౌడీ హీరో ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
పూరీ కనెక్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన 'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. మరి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.