ప్చ్.. టేబుల్ క్లాత్ అంట.. ట్రోలర్ల హీట్!

Update: 2019-07-06 04:20 GMT
ఫ్యాషన్ సెన్స్ పీక్స్ లో ఉండే బాలీవుడ్ భామల్లో కియారా అద్వాని ఒకరు.  ఏ డ్రెస్ అయినా సరే.. కియారా అద్భుతంగా క్యారీ చేస్తుంది.  ట్రెడిషనల్ గా చుడిదార్లో కనిపించినా.. హాట్ గా బికినీలో కనిపించినా.. లేదా థై స్లిట్ గౌన్లలో తళుక్కున మెరిసిన.. ఇవన్నీ కాకుండా చిట్టిపొట్టి నిక్కర్ -టీషర్ట్ వేసుకొని కనిపించినా జనాలు కియారా మాయలో పడిపోవాల్సిందే.  అయితే..

ఒక్కోసారి ఎంత ఫ్యాషన్ సెన్స్ ఉన్నా డ్రెస్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కోసం గోతికాడ నక్కల్లా కాచుక్కూచునే ట్రోలర్లు ఇక చెలరేగిపోతారు.  కియారా నటించిన తాజా చిత్రం 'కబీర్ సింగ్' బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయి ఇప్పటికి 14 రోజులైతే..  రూ.214 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా కూడా జోరు కొనసాగిస్తోంది.  దీంతో 'కబీర్ సింగ్' టీమ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి కియారా ఒకలాంటి థై స్లిట్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా కులుకుతూ వచ్చింది.  అయితే ఈ డ్రెస్ పై పెద్దగా కంప్లయింట్లు లేవు కానీ దాన్ని కుట్టడానికి వాడిన క్లాత్ చూస్తే  'కిచెన్ క్లీనింగ్ క్లాత్' లాగా.. 'టేబుల్ క్లాత్' లాగా ఉందని ట్రోలర్లు గట్టిగా తగులుకున్నారు.  

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. అలాంటి టేబుల్ క్లాత్ డ్రెస్ వేసుకున్నా అందంగా నవ్వుతూ సెక్సీ గా పోజులిచ్చి అందరినీ మాయ చేసింది.  హెయిర్ స్టైల్.. హై హీల్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.  ప్రియాంక మెట్ గాలా షాక్ తో పోలిస్తే ఇది జస్ట్ వన్ పర్సెంట్.. అంతే. కియారా పాప ఇంకా గ్లోబల్ సుందరి కాలేదు కదా అందుకే ఫ్యాషన్ సెన్స్ ఇంకా విపరీతంగా మారలేదు. 
Tags:    

Similar News