ఈ మధ్య మెగాస్టార్ సినిమాలు నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి. ఆ ట్రోలింగ్ చేస్తున్నది కూడా మెగా ఫ్యాన్సే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత 'ఆచార్య' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ చరణ్ కూడా కీలక అతిథి పాత్రలో నటించడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. థియేటర్లలో ఇక రీసౌండ్ ఖాయం అంటూ నెట్టింట సందడి చేశారు. కానీ సినిమా రిలీజ్ రోజే డిజాస్టర్ అని తేలడంతో షాక్ కు గురయ్యారు.
మేకింగ్, కథ, కథనాలు, గ్రాఫిక్స్ పై నెట్టింట మేకర్స్ తో పాటు దర్శకుడిపై ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరు సినినిమా ఇలా వుంటుందని అనుకోలేదంటూ ఓ రేంజ్ లో మేకర్స్‌పై, దర్శకుడు కొరటాల శివపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత చిరు మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా 'గాడ్ ఫాదర్' మూవీలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలియగానే అందరి దృష్టి 'గాడ్ ఫాదర్'పై పడింది. ఈ మూవీతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ ని చిరు సొంతం చేసుకోవాలని ఆశగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.
అయితే టీజర్ నుంచి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ ని పోలి వుండటంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఫ్యాన్స్ సంగీత దర్శకుడు తమన్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇక ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో చిరు, సల్మాన్ లపై ప్రభుదేవా నృత్య దర్శకత్వం లో చేసి 'థార్ మార్ తక్కర్ మార్' లిరికల్ వీడియోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రభుదేవా డ్యాన్స్ కంపోజింగ్.. అంటే మెగాస్టార్ స్టెప్పులు మామూలుగా వుండవని ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. అయితే ఈ పాటకు సాండీ డ్యాన్స్ కంపోజ్ చేయగా ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. చిరు, సల్మాన్ లాంటి ఇద్దరు స్టార్స్ వున్న స్పెషల్ సాంగ్ కి ప్రభుదేవా పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఎక్కడా కనిపించలేదు. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, చిరు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అసలు సింక్ అన్నదే లేకుండా ముగ్గురు డ్యాన్స్ చేస్తున్న తీరు ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
దీంతో బాస్ తో ఎలాంటి స్టెప్స్ వేయించిన ప్రభుదేవా.. ఈ పాటకు ఎలాంటి స్టెప్స్ వేయించాడని, ఇద్దరు స్టార్ ల మధ్యలో నిలబడి ప్రభుదేవా ఎవరికి నచ్చింది వారు వేసేయండి అన్నట్టుగా వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సరికొత్త స్టెప్స్ తో అదరగొడతాడనుకుంటే ప్రభుదేవా సింపుల్ గా కానిచ్చేసి షారిచ్చాడని, అతని కంటే శేఖర్ మాస్టర్ బెటర్ అని మండిపడతున్నారు. అంతే కాకుండా వారం రోజులుగా ఊరించి ఉసూరుమనిపించారని మేకర్స్ పై కూడా మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

evadiki nachinattu aadu chesukuntunnadu pic.twitter.com/4lmewxvCsn
— . (@prasaduuuuuu) September 21, 2022