గత కొన్నేళ్ల క్రితం మన సినిమా అంటే హాలీవుడ్ మేకర్స్‌కి, స్టార్స్ కి బాలీవుడ్ మాత్రమే. కానీ ఇప్పడు ఇండియన్ సినిమా అంటే ఒక్క బాలీవుడ్ మాత్కమే కాదని, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ కూడా వుందని తెలిసిపోయింది. ఇక సోషల్ మీడియా వచ్చాక మన వాళ్లు ఎలాంటి సినిమాలు చేస్తున్నారన్నది వెంటనే పసిగట్టేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆ మధ్య ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రాలు ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఫ్రెంచ్ మూవీ 'లార్గోవించ్' ఆధారంగానే ఈ రెండు చిత్రాలు తెరకెక్కాయని సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కి కూడా తెలియడంతో వెంటనే స్పందించాడు. అదే నిజమైతే రైట్స్ కి సంబంధించిన కేసు వేస్తానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిచాడు కూడా. రిలీజ్ వరకు జరిగిన ఈ హంగామా రిలీజ్ తరువాత కూడా కంటిన్యూ అయ్యింది. కారణం 'సాహో', 'అజ్ఞాతవాసి' చిత్రాల కథలు ఫ్రెంచ్ మూవీ 'లార్గోవించ్' కథని పోలి వుండటమే.
తాజాగా మరో స్టార్ హీరో సినిమాపై ఇదే తరహా కాపీ వివాదం మొదలైంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి 'వారసుడు' పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో 'వారీసు'గా రూపొందుతున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ కోసం శంషాబాద్ సమీపంలోని నిర్మాత దిల్ రాజుకు చెందిన స్థలంలో ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు.
ఇందులో కీలక సన్నివేశాలని చిత్రీకరించాలని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ట్యాగ్ లైన్ 'ద బాస్ రిటర్న్స్' ఇదే ఇప్పడు ఈ మూవీకి ప్రధాన సమస్యగా మారినట్టు తెలుస్తోంది. ట్యాగ్ లైన్ ని బట్టి ఈ చిత్ర కథ ఇదేనంటూ నెట్టింట మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. ఓ బడా బిలియనీర్ చనిపోతే ఎక్కడో రహస్యంగా పెరుగుతున్న వారసుడు తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకోవడమే ఈ చిత్ర కథ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్ ' మెయిన్ స్టోరీ లైన్ ఇదే. ఇదే పాయింట్ తో 'సాహో', 'అజ్ఞాతవాసి' చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ఇదే పాయింట్ నేపథ్యంలో విజయ్ 'వారసుడు' సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారని నెట్టింట మీమ్స్ తో ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయం తెలియడంతో మళ్లీ 'లార్గోవించ్' డైరెక్టర్ జెరోమ్ సల్లే నెట్టింట హంగమా చేయడం మొదలు పెట్టారు. నెటిజన్ లు చేస్తున్న ట్వీట్ లని రీట్వీట్ లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రచారమే నిజమైతే 'వారసుడు' మూవీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఈ మూవీపై జరుగుతున్న కాపీ వివాదంలో వున్న నిజమెంతన్నది తెలియాలంటే ఈ మూవీ టీజర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.