ఖమ్మంలో ఈ నెల 27న నిర్వహించే టీఆర్ ఎస్ ప్లీనరీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక అడుగు వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు శాసన సభ ఉప ఎన్నిక మే 16న జరగనున్న నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్లీనరీ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో టీఆర్ ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నామని ఈ లేఖలో మంత్రి కేటీఆర్ వివరించారు. పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే ప్లీనరీ వేదికను ముందే నిర్ణయించామని పేర్కొంటూ ఇతర జిల్లాలకు మార్చే సమయం లేనందున ప్లీనరీకి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ రాయాల్సిన లేఖను మంత్రి కేటీఆర్ రాయడం ఆసక్తికరంగా మారింది.