దర్శకధీరుడు జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బారీ మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25న ఎట్టకేలకు విడుదలవుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు, గోండు బెబ్బుల కొమరం భీంల ఫిక్షనల్ స్టోరీగా ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఇద్దరు పోరాట యోధులు బ్రిటీష్ ప్రభుత్వంపై పంజా విసిరిన కథగా ఈ చిత్రాన్ని ఆద్యంతం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఈ మూవీ కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోవడంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ని రాజమౌళి భారీగా ప్లాన్ చేసి దేశ వ్యాప్తంగా ఇద్దరు హీరోలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం దుబాయ్ లో బారీ ఈవెంట్ ని పూర్తి చేసుకున్న చిత్ర బృందం శనివారం కర్ణాటకలోని చిక్ మంగళూరులో మరో భారీ ఈవెంట్ ని నిర్వహించబోతోంది.
ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వం 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ కి శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. 300 కోట్లకు మించిన బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి తెలంగాణ వ్యాప్తంగా టికెట్ రేట్లు పెంచుకునే విధంగా జీవోని విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు శుభవార్త చెప్పింది.
మార్చి 25న ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 25 నుంచి 27 వరకు అంటే మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50. 28 నుంచి ఏప్రిల్ 3 వరకు అంటే వారం రోజుల పాటు టికెట్ పై రూ. 30 పెంచుకోవచ్చని జీవోని విడుదల చేసింది.
మల్టీప్లెక్స్ లలో మార్చి 25 నుంచి 27 వరకు రూ. 100, 28 నుంచి ఏప్రిల్ 3 వరకు రూ. 50 పెంచుకోవచ్చని సదరు జీవోలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 3 నుంచి రోజుకు 5 షోలు వేసుకునే విధంగా వెసులుబాటుని కూడా కల్పించారు. తాజా జీవో కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తొలి మూడు రోజులు మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 350 గాను, థియేటర్లలో 225 గానూ పెంచుకోవచ్చని స్పష్టం చేయడం గమనార్హం.
తెలంగాణ సర్కారు తాజాగా విడుదల చేసిన జీవోపై 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద చిత్రాలకు ఈ విధంగా టికెట్ రేట్లని పెంచుకునే వెలసుబాటు కల్పించడం వల్ల అవి నష్టాల నుంచి బటయపడే అవకాశం వుంటుందని, ఈ విషయంలో సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలని చిత్ర బృందం తెలిపినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.