బన్నీకి పెద్ద పంచ్ పడేలా ఉందే..

Update: 2017-06-17 07:58 GMT
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్లు బాగా విస్తరించాయి. పొరుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ల సినిమాలు పెద్ద ఎత్తున రిలీజవుతున్నాయి. భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. తెలుగు సినిమాలకు బాగా మార్కెట్ ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటక. ఆ తర్వాతి స్థానం తమిళనాడుదే. ముంబయితో పాటు కొన్ని ఉత్తరాది నగరాల్లో కూడా తెలుగు సినిమాలు బాగానే ఆడతాయి. అల్లు అర్జున్ కు కేరళలోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ‘దువ్వాడ జగన్నాథం’ డబ్బింగ్ వెర్షన్ కేరళలో కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈలోపు 23న కర్ణాటక.. తమిళనాడులతో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ‘డీజే’ విడుదలవుతోంది. ఐతే అదే రోజు వేరే భాషల్లోనూ భారీ సినిమాలు రిలీజవుతుండటం ‘డీజే’ వసూళ్లపై ప్రభావం చూపేలా ఉంది.

హిందీలో సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’ భారీ అంచనాల మధ్య 23నే విడుదల కాబోతోంది. కాబట్టి ఉత్తరాదిన ‘డీజే’ వసూళ్లకు పంచ్ పడటం ఖాయం. అలాగే బెంగళూరు.. చెన్నై లాంటి నగరాల్లోనూ ‘ట్యూబ్ లైట్’ భారీగానే విడుదలవుతోంది. ఇక కోలీవుడ్ బాక్సాఫీస్ లోనూ 23న గట్టి పోటీ ఉంది. శింబు సినిమా ‘ఏఏఏ’తో పాటు జయం రవి మూవీ ‘వనమగన్’ కూడా మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. వీటికి మెజారిటీ థియేటర్లు ఇచ్చేస్తున్నారు. తమిళనాట మామూలుగానే థియేటర్లు తక్కువ. అందులో మెజారిటీ తమిళ సినిమాలకే వెళ్తున్నాయి. ఆ మధ్య ‘కాటమరాయుడు’ లాగా ‘డీజే’కు పెద్దగా థియేటర్లు దొరకడం కష్టమే. తమిళ సినిమాలు కర్ణాటకలో కూడా పెద్ద స్థాయిలోనే రిలీజవుతాయి కాబట్టి అక్కడే వసూళ్లపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఓవర్సీస్‌ లోనూ ‘ట్యూబ్ లైట్’ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఈ పోటీని తట్టుకుని ‘డీజే’ ఏమేరకు నెట్టుకొస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News