వారాహి వారు రూటు మార్చేస్తే ఎలా?

Update: 2015-03-20 11:30 GMT
ఎవరైనా ఒక రూట్లో వెళుతున్నారు అనుకోండి.. వారు అదే రూటులో వెళ్ళాలని ఎక్కువగా కోరుకుంటారు ఫిలిం నగర్‌ ప్రజలు. రాఘవేంద్రరావు హారర్‌ సినిమా తీస్తే ఎలా? తమన్నా స్విమ్మింగ్‌ పూల్‌లోకి చీర కట్టుకొని దిగితే ఎలా? గీతా ఆర్ట్స్‌ వారు మగధీర కాకుండా 4 లక్షల్లో ఐస్‌క్రీం వంటి సినిమాలు తీస్తామంటే ఎలా? అలాగే సాయి కొర్రపాటి కి కూడా కొన్ని రూల్స్‌ వర్తిస్తాయి. ఎలాగొలా వాటిని ఫాలో అవుతూనే కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది. లేకపోతే ఎలా?

ఈరోజు ''తుంగభద్ర'' సినిమా విడుదలయ్యింది. ఈగ తరువాత అందాల రాక్షసి, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య సినిమాలను తీసిన నిర్మాత సాయి కొర్రపాటి ఈసారి ఏం సినిమా తీస్తాడని అనుకుంటారు? పైగా ఈ సినిమా ట్రైలర్స్‌ చూసిన వెంటనే.. ఇదేదో అనంతపురం 1980 టైపు ప్రేమకథా చిత్రమనే అనుకుంటారు. కాని సినిమాలో మాత్రం.. మొత్తంగా రాజకీయాలపై ఫోకస్‌ చేశారు.. బాగానే ఉంది. కాని ప్రేమకోసం ధియేటర్స్‌కు వచ్చిన వారికి రాజకీయ పాఠాలు నేర్పిస్తామంటే ఎలా? అందుకే తొలిరోజు ఆడియన్స్‌కు షాక్కొట్టేసినట్లయ్యింది. వారాహి వారు రూటు మార్చి పెద్ద తప్పే చేశారని అంటున్నారు ట్రేడ్‌ పండితులు కూడా. నాలుగు రోజులయ్యాక కలెక్షన్లు చూస్తే కాని ఆ విషయం అర్ధంకాదులేండి.
Tags:    

Similar News