20 ఏళ్ల టీవీ నటి తునీషా శర్మ బలవన్మరణం సంచలనమైన సంగతి తెలిసిందే. తాను నటిస్తున్న షో సెట్స్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకోవడంతో దీని వెనక కారణాలపై పోలీసులు ఆరాలు తీస్తున్నారు. తాజా విచారణపై వివరాల్లోకి వెళితే.. `అలీ బాబా దస్తాన్-ఈ-కాబూల్` టీవీ షోలో షెహజాదీ మరియమ్ గా నటించిన టెలివిజన్ నటి తునీషా శర్మ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ లో షో సెట్ లో డిసెంబర్ 24న ఆత్మహత్యకు పాల్పడింది.
తునీషా వయసు కేవలం 20. ఆమె అంత్యక్రియలు డిసెంబర్ 27 మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. పరిశ్రమ సహోద్యోగుల సమక్షంలో జరిగాయి. తునీషా సహనటుడు షీజాన్ ఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
తునీషా శర్మ మరణం అనంతరం అరెస్ట్ అయిన షీజన్ ఖాన్ మరో మాజీ ప్రియురాలు వాట్సాప్ చాట్ లను డిలీట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. షీజన్ ఖాన్ తన మాజీ ప్రేయసితో వాట్సాప్ లో మాట్లాడుతున్నాడని అయితే ఆ తర్వాత ఆమెతో చేసిన చాట్ లన్నింటినీ తొలగించాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు షీజన్ మొబైల్ ఫోన్ నుండి 250 పేజీల వాట్సాప్ చాట్ లను కనుగొన్నారు. వాటిని అధ్యయనం చేసి మరింత విశ్లేషిస్తారు. షీజన్ తన మరో మాజీ ప్రియురాలితో చేసిన చాట్ లన్నింటినీ తిరిగి పొందాలని పోలీసులు వాట్సాప్ కు లేఖ రాశారు. అతను సందేశాలను ఎందుకు తొలగించాడో పరిశీలిస్తున్నారు.
డిసెంబర్ 24న తునీషా శర్మ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు సహనటుడు మాజీ ప్రియుడు షీజన్ ప్రేరేపించినట్లు ఫిర్యాదు చేసారు. అనంతరం విచారణలో భాగంగా నటుడిని అరెస్టు చేసిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. షీజన్- తునీషా రిలేషన్ షిప్ లో ఉన్నారని వారు 15 రోజుల క్రితం విడిపోయారని వార్తలు వస్తున్నాయి. తునీషా శర్మ ఒత్తిడిలో ఉన్నారని.. ఆత్మహత్య ఆలోచనలకు ప్రేరేపించిన అంశమిదని తొలుత ఊహాగానాలు సాగాయి. కానీ దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు తునీషా ఎటువంటి సూసైడ్ నోట్ ను రాయలేదని సమాచారం. ఇది హత్యా? ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది. తునీషా బలవన్మరణం వెనక ఏం జరిగిందనేది విచారణలో పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పటికి ఇంకా దీనిపై సరైన స్పష్ఠత లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.