* హాయ్ మనోజ్ గారు ఎలా ఉన్నారు
హాయ్ శ్యామ్ గారు నేను బాగున్నా, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారుగా, మీ తుపాకీ టీమ్ అంతా సేఫ్ గానే ఉన్నారుగా, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా లేక ఇంటికి వెళ్లిపోయారా..! సాధరణంగా ఈ కుశల ప్రశ్నలుకు జవాబుగా ప్రశ్న అడిగిన వారి యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం పద్ధతి అందుకే మీ అందరి గురించి ఆరా తీసాను, మరోలా అనుకోకండి.
* అంతా బాగనే ఉన్నాం, మనోజ్ గారు థ్యాంక్యూ ఫర్ యువర్ గ్రేట్ కన్సర్న్, ఈ క్వారంటైన్ పిరియడ్ ని ఎలా గడుపుతున్నారు
నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు ముగింపుకి వచ్చింది. టీమ్ అందరం స్కైప్, టెలికాన్ఫ్ రెన్స్ లో డిస్కస్ చేసుకుంటూ కథని ఓ కొలిక్కి తీసుకువచ్చాము. అలానే మూడేళ్లుగా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం టైమ్ కేటాయిద్దాం అనుకుంటున్నా దానీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి అయింది. ఇక కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నా మనసున తొలిచేస్తున్న ఇష్యూ వలస కార్మీకుల బాధలు, ఆకలి చావులు, కష్టాలు. నా అభిమానులు, నాకున్న టీమ్ మేరకు కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి రకారకాల సహాయం చేస్తూ వచ్చాము. కానీ ఇంత చేస్తున్న నాలో ఎక్కడో అసంతృప్తి ఇంకా చేయాలి అనే పట్టుదల రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అందుకే నేను చేసే సేవా కార్యక్రమాల్లో ఇంకో అడుగు ముందుకు వేసి, వలస కార్మీకుల్ని నా వంతుగా వారి సొంత ఊళ్లకి పంపించడానికి బస్సులు సిద్ధం చేయించాను. అవకాశం ఉన్నా ప్రస్తుతం బస్సులు కొరత, పర్మీషన్లు ఇలా చాలా ఇబ్బందుల్ని అనేకనేక అధికారులతో స్వయంగా మాట్లాడి ఓ మూడు బస్సుల్ని సిద్ధం చేయించాను. ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగే విధంగా నా టీమ్ తో ఓ ప్రణాళిక కూడా రెడీ చేసి పెట్టాను. కార్మీకుల్ని ఇంటికి పంపించడమే కాకుండా వారికి దారిలో కావాల్సిన ఆహారం ఎక్కడిక్కడ అందే రీతిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
* గ్రేట్, వలస కార్మీకులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి సినిమా పరిశ్రమ కూడా కోలుకోలేని స్థితికి చేరుకుంది దీని పై మీ స్పందన ఏంటి
అవును నేను ఒప్పకుంటాను సినిమా ఇండస్ట్రీ కూడా కోలుకోలేని స్థితికి వచ్చేసింది, కానీ ఒక్కసారి షూటింగ్స్ మొదలైతే యదావిధిగా చిత్ర పరిశ్రమ మళ్లీ పుంజుకుంటుందని నేను నమ్ముతున్న, దీనికి మించిన సమస్య వలస కార్మికులది, ఇప్పుడు నా దృష్టి మొత్తం నా శక్తి మేరుకు వీలైనంతగా ఆ అక్క చెల్లలను, అన్నదమ్ములను వారి స్వస్థాలకు పంపే ఏర్పాట్లు చేస్తాను.
*ఓటీటిల ప్రభావం ఇండస్ట్రీని మరింత దెబ్బతీస్తాయని కొందరు వాదిస్తున్నారు, దీని మీ స్టేట్మెంట్ ఏంటి
ఒక చిన్న సినిమా విడుదల అవ్వలాంటే, కొందరు సినీ పెద్దల ఆఫీసులు చుట్టూ తిరగాలి, ఓటీటీలు రావడం వల్ల చిన్న సినిమాలు బ్రతుకుతాయి, చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు ఆర్థికంగా కలిసే వచ్చే రీతిన ప్రస్తుతం ఓటీటీలు ఆఫర్లు ఇవ్వడాన్ని నేను సంపూర్ణంగా స్వాగతిస్తాను. అలానే ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ మైండ్ సెట్ ఎవ్వరు మార్చలేరు. కొందరు స్వార్థ పూరిత సినీ పెద్దలు, థియేటర్లని వారి హస్తగతం చేసుకొని ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తున్నారు. ఓటీటీలు పెరిగితే పరిశ్రమ పై వారి హోల్డ్ పోతుందనే భయంతోనే ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి ప్రమాదం అనే తప్పుడు సంకేతాల్ని ప్రచారం చేస్తున్నారు. నేనే ఇలాంటి వార్తల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. సవత్సరం పాటు వెనక్కి వెళ్లిపోతున్నాం అంటూ గొగ్గోలు పెడుతున్న సినీ పెద్దలంతా ఓటీటీలకు సపోర్ట్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి పునర్జన్మ ఇచ్చినవారవుతారు. ఇలాంటి ఇష్యూ కానీ వస్తే నా సపోర్ట్ ఓటీటీ లకే.
* ఈ విలక్షణ మనసతత్వం, ముక్కుసూటి సాగే విధానం మొహన్ బాబుగారి దగ్గర నుంచే వచ్చినప్పటికీ దీని కారణంగా ఇబ్బందలు ఎదురవ్వడం లేదా
ఇబ్బందలు వస్తాయి, కానీ నేను ఇంతే నా పంధా మారదు, తెలిసి కూడా తప్పుని సపోర్ట చేయడం నా నైజం కాదు. మంచో చెడో ఓటీటీలు వల్ల చిన్న సినిమా బ్రతుకుంది, వాటికి పెట్టుబడి పెట్టే నిర్మాతలు బ్రతుకుతున్నారు. ఇక నాన్న గారి దగ్గర నుంచి విలక్షణ నటనతో పాటు మనస్తత్వం కూడా వచ్చేసింది.
* మరీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో ఆ విలక్షణ నటనని మరోసారి మీ అభిమానులకి రుచి చూపించబోతున్నారా
అవును ఆ విలక్షణిజంలో మరో గేర్ వేసాను, కచ్ఛితంగా ఆడియెన్స్ కి నచ్చుతుందని నేను అనుకుంటున్నా.
* అహం బ్రహ్మాసీ అంటే నేను దేవుడ్ని అని అర్థం ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది
మేము ఈ సినిమాని పాన్ ఇండియా తియ్యాలని ప్లాన్ చేశాము, వ్యక్తిగతంగా నేను శివ భక్తుడ్ని, ఇప్పుడు సినిమాలో కూడా శివ భక్తుని పాత్ర పోషిస్తున్నా, ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు కాబ్బట్టి ప్రస్తుతానికి నేను ఇంత వరకే చెప్పగలను కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ షూటింగ్ మొదలైన వెంటనే తుపాకీ వారికి ముందుగా అందిచడానికి ప్రయత్నిస్తాను (నవ్వులు)
* మీరిచ్చే అప్ డేట్స్ కి మీకు, మా తుపాకీ టీమ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ - థ్యాంక్యూ
థ్యాంక్యూ సో మచ్ - తుపాకీ డాట్ కామ్ రీడర్స్ అంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వం వారు ఇచ్చిన నీయమాల్ని పాటిస్తూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నా, మీకు ఉన్నంతలో లేని వారికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్