షూటింగ్ లో న‌టిని క‌రిచేసిన కుక్క‌!

Update: 2018-04-19 07:03 GMT
షూటింగ్ అంటే స‌ర‌దానే కాదు బోలెడంత రిస్క్ ఉంటుంది. తాజాగా అలాంటి రిస్కే ఎదుర్కొంది బాలీవుడ్ క‌మ్ బుల్లితెర న‌టి రీనా అగ‌ర్వాల్‌. ఒక టీవీ షో షూటింగ్ లో పాల్గొన్న ఆమెపై కుక్క దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. క్యా హాల్ పంచ‌ల్ షో పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో ఒక కుక్క‌తో స‌ద‌రు న‌టి ఒక సీన్ చేస్తోంది.

అనూహ్యంగా షూటింగ్ లో కుక్క ఆ న‌టి మీద ప‌డి క‌రిచేసింది. ముఖం మీద క‌ర‌వ‌టంతో ఆమె షాక్ కు గుర‌య్యారు. తీవ్ర‌మైన గాయం కావ‌టంతో ఆమెను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌ద‌రు న‌టి ముఖానికి గాయాలు కావ‌టంతో కుట్టు వేసిన‌ట్లుగా వైద్యులు చెబుతున్నారు.

గ‌తంలో రీనా ప‌లు టీవీ సీరియ‌ల్స్ తోపాటు అమీర్ ఖాన్ తో త‌లాష్.. బ‌హెన్ హోగీ తేరీ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. తాజాగా అయిన గాయం కార‌ణంగా ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News