హిందీలో ఇకపై రెండు బిగ్‌ బాస్ లు ??

Update: 2021-07-24 11:30 GMT
హిందీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన షో బిగ్‌ బాస్‌. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న బిగ్‌ బాస్‌ ఇండియాలో పలు భాషల్లో ప్రసారం అవుతోంది. హిందీలో సుదీర్ఘ కాలంగా సల్మాన్ ఖాన్‌ హోస్ట్ గా ఈ షో సాగుతోంది. బిగ్‌ బాస్‌ సీజన్‌ సీజన్ లకు ముగుస్తూనే ఉన్నా ఇంట్రెస్ట్‌ మాత్రం మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హిందీతో పాటు తమిళం.. తెలుగు.. కన్నడం.. మలయాళం భాషల్లో కూడా బిగ్‌ బాస్ ప్రసారం అవుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ కు సల్మాన్‌ హోస్టింగ్‌ చేస్తున్నాడు. తాజాగా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఇట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. తనకు అత్యంత ఇష్టం అయిన బిగ్ బాస్ ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు.

సల్మాన్‌ బిగ్‌ బాస్ టీవీలో టెలికాస్ట్‌ కానుండగా కరణ్‌ జోహార్‌ హోస్టింగ్‌ చేయబోతున్న బిగ్ బాస్ ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట. ఇటీవల కరణ్‌ జోహార్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు మరియు తన తల్లికి బిగ్‌ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ తో చాలా ఎంటర్‌ టైన్‌ అవుతూ ఉంటాం. కనుక నాకు ఇష్టమైన బిగ్ బాస్ కు హోస్టింగ్‌ చేయాలని భావిస్తున్నట్లుగా కరన్‌ జోహార్‌ చెప్పుకొచ్చారు. కరణ్‌ జోహార్‌ ఇప్పటికే చాలా షో లకు హోస్టింగ్‌ చేశాడు. ఆయన కు హోస్టింగ్‌ కొత్త కాదు కాని బిగ్‌ బాస్ హోస్టింగ్‌ కొత్త అవ్వడం వల్ల ఆయన ఎలా చేస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరణ్‌ జోహార్‌ బిగ్ బాస్ సీజన్ లు ఎన్నింటిని నడిపిస్తాడు అనేది చూడాలి. సల్మాన్ ఖాన్‌ ఎంత కాలం చేసినా కూడా జనాలు మాత్రం బోర్ ఫీల్‌ అవ్వడం లేదు. అదే తరహాలో కరణ్‌ జోహార్ నడిపించగలడా.. ఓటీటీ బిగ్‌ బాస్ లో కొత్తగా ఏం చూపిస్తారు అనేది చూడాలి. ఒక వేళ హిందీ ఓటీటీ బిగ్ బాస్ సక్సెస్‌ అయితే సౌత్‌ లో కూడా మొదలు అయ్యేనా అనేది చూడాలి. అక్కడ సక్సెస్‌ అయితే రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సౌత్‌ లో బిగ్‌ బాస్‌ ఓటీటీ తెలుగు మొదలు అయ్యేనేమో చూడాలి.
Tags:    

Similar News