ఒక సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో వహించే అతి జాగ్రత్త దానికే సంబంధించిన మరో అంశానికి నెగటివ్ గా మారొచ్చు. 2.0 వరస అలాగే ఉంది. పోస్టర్లతో మొదలుకుని సక్సెస్ మీట్ల దాకా ప్రతి చోటా ఈ సినిమాను త్రీడిలోనే చూడండి పది రెట్లు గొప్ప అనుభూతి పొందుతారు అని పదే పదే ఊదరగొట్టడంతో అసలు టూడిలో చూడటం వేస్ట్ ఏమో అనే నిశ్చితాభిప్రాయనికి వచ్చారు అధిక శాతం ప్రేక్షకులు. ఇది నేరుగా సింగల్ స్క్రీన్ల మీద అసలు త్రీడి వసతులే లేని సెంటర్స్ లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా వసూళ్లు చెబుతున్నాయి.
నిజానికి సినిమాలో ఎంత గ్రాఫిక్స్ ఉన్నా మెప్పించే కంటెంట్ ఉన్నప్పుడు టూడి అయినా ఒకటే త్రీడి అయినా ఒకటే. జురాసిక్ పార్క్- స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ వెర్షన్ తో సంబంధం లేకుండా సమాన విజయాన్ని దక్కించుకున్నాయి. అంత దాకా ఎందుకు వందల కోట్లు కొల్లగొట్టిన రోబో వచ్చింది పక్కా 2డిలోనే. కొన్నేళ్ళ తర్వాత త్రీడి వెర్షన్ రిలీజ్ చేసారు కాని ఎవరు పట్టించుకోలేదు. సో త్రీడి అదనపు ఆకర్షణ అవ్వాలే తప్ప అది లేకుంటే సినిమా చూడటం వేస్ట్ అనే అభిప్రాయం కలిగించడం సరికాదు.
ఇప్పుడు ఈ డిల పబ్లిసిటీ వసూళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడంతో బిసి సెంటర్ల బయ్యర్లు రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ఒకవేళ డ్రాప్ ఉంటే మాత్రం పబ్లిసిటీ స్పీడ్ ని పెంచాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలాగే ఉంటే మాత్రం రికవరీ శాతం పడిపోతుంది. పోటీలో ఏ ఒక్క సినిమా లేకపోవడం కాస్త కలిసి వస్తోంది. డిసెంబర్ 7 నుంచి తెలుగులో కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. చెప్పుకోదగ్గ సినిమాలే ఉన్నాయి కాబట్టి ప్రభావం అయితే ఉంటుంది. సో త్రీడి టూడి అంటూ మరీ ఎక్కువ భేదం చూపించకుండా పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు కాస్త జాగ్రత్త పడితే బెటర్. లేదంటే ఫైనల్ కౌంట్ లో భారీ తేడాలు వచ్చే అవకశం లేకపోలేదు