సోషల్ మీడియా ప్రభావమో లేక ఇంటర్నెట్ కాలంలో మనిషి అతి తెలివో తెలియదు గాని ఎవరికీ వారు ఈ మధ్య జడ్జ్ లు అయిపోతున్నారు. అభిప్రాయం చెప్పకుండా జనల అభిప్రాయం ఇదేనని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫెమస్ అవ్వడానికి ఈ రోజుల్లో సినిమాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం అలవాటయ్యింది. ఆ సంగతి పక్కనపెడితే సినిమా రిలీజ్ కు ముందే గత కొంత కాలంగా యూఏఈ నుంచి ఒక రివ్యూ వస్తోంది.
ఇండియన్ సినిమాలను ఎక్కువగా చూసే ఉమర్ సందు తరచు రివ్యూలను ఇస్తుండడం అలవాటే. కాకపోతే ఈ క్రిటిక్ గారు ఇచ్చే రివ్యూలు జనాలకు వ్యతిరేకంగా ఉంటాయి. తన అభిప్రాయం చెప్పకుండా జనాలకు ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అని చెబుతుంటాడు. ఇక రీసెంట్ గా రజినీకాంత్ కాలా సినిమా గురించి ఉమర్ రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా బావుందని దర్శకుడు పా.రంజిత్ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించినట్లు చాలా గొప్పగా చెప్పాడు.
అంతా బాగానే ఉంది కానీ ఈ క్రిటిక్ గారు గతంలో చెప్పిన అడ్వాన్స్ రివ్యూలన్నీ రివర్స్ అయ్యాయి. ఇప్పుడు కాలా సినిమాకు 4 స్టార్స్ రేటింగ్స్ ఇవ్వవచ్చని చెప్పాడు. అయితే గతంలో కబాలి సినిమాకు కూడా ఇదే రేంజ్ లో కవరింగ్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల నుంచి ఏ తరహాలో ఆదరణను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పా.రంజిత్ ఈ సారి తప్పకుండా మెప్పిస్తాడు అని ఫైనల్ చేశాడు. మారి కాలా ఆ స్థాయిలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.