ప్రయోగం కేరాఫ్ బిగ్ బి. కెరీర్ లో అమితాబ్ చేయని ప్రయోగం అన్నదే లేదు. నాలుగున్నర దశాబ్ధాల నటజీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలతో అభిమానులను అలరించారు. ఒక లివింగ్ లెజెండ్ గా ఆయనను ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు. 77 వయసులోనూ ఆయన నిత్యయవ్వనుడిలా హుషారుగా నటిస్తుండడం ఎందరికో స్ఫూర్తి.
టీనేజీ గాళ్ ని ప్రేమించే 60 ప్లస్ ఓల్డ్ మన్ గా నటించినా ఆయనకే చెల్లింది. సెరిబ్రల్ పార్శీ అనే అరుదైన వ్యాధితో బాధపడే బాలకుడి పాత్రలో నటించినా ఆయన వల్లనే సాధ్యమైంది. గోసాయి వెంకన్నగా సైరా నరసింహారెడ్డి చిత్రానికి వెయిట్ పెంచిన ఘనత తనకే చెల్లింది. ఈ ప్రయోగాలు ఇంతటితో ఆగిపోయేట్టు లేవు. ప్రస్తుతం మరో ప్రయోగాత్మక పాత్రతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
గులాబో సితాబో అనేది సినిమా. కామెడీ డ్రామా చిత్రమిది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. షూజీత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ తో పికు చిత్రాన్ని.. ఆయుష్మాన్ ఖురానాతో విక్కీ డోనర్ చిత్రాన్ని తెరకెక్కించిన షూజీత్ ఈసారి ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తున్నారు. అమితాబ్ - ఆయుష్మాన్ కలయికలో ఇదే తొలి సినిమా.
ఇదివరకూ ఈ చిత్రం నుంచి అమితాబ్ స్టిల్ ని చిత్రబృందం రిలీజ్ చేశారు. దానికి అద్భుత స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ ప్రీపోన్ అయ్యింది అంటూ మరో కొత్త కబురు అందింది. గులాబో సితాబో చిత్రం 28 ఫిబ్రవరి 2020 రిలీజవుతుందని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కొత్త తేదీని వెల్లడించారు. దీంతో పాటు అమితాబ్-ఆయుష్మాన్ స్టిల్ ని రిలీజ్ చేశారు. దీనికి అద్భుత స్పందన వస్తోంది. తెల్ల పైజామాపై పచ్చ రంగు కుర్తాతో కనిపించిన అమితాబ్ ఒక వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. అసలు ఆయన అమితాబ్ యేనా? అన్న సందేహం కలిగేంతగా గుర్తు పట్టలేనంతగా ఉంది ఆ రూపం. మాసిన దుస్తులతో మామూలు సాధాసీదా ముసలాయనలా ఆ గెటప్ ఆశ్చర్యపరుస్తోంది. కళ్ల జోడు.. నెరిసిన గడ్డం ఈ మేకవర్ లో ప్రతిదీ షాకిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అమితాబ్ పాత్ర అంత పేదరికంలో ఉండేదా? అంటే కానేకాదు. ఒక భూస్వామి అలా ఎందుకు కనిపిస్తున్నాడు? అన్న సస్పెన్స్ ఉంటుంది. ఇక ఆయుష్మాన్ పాత్ర అంతే ఆసక్తికరం. అతడు తెల్ల పైజామా గీతల చొక్కాతో మామూలు సాధాసీదా కుర్రాడిలా అమాయకుడిలా కనిపిస్తున్నాడు. ఆ ఇద్దరినీ చూస్తే తాతా మనవళ్లు తరహాలో కనిపిస్తున్నారు. అమితాబ్ లుక్ ఇదివరకూ రివీలైనప్పుడు అద్భుత స్పందన వచ్చింది. ఈసారి మాత్రం అమితాబ్ తో ఆయుష్మాన్ కలిసి ఉన్న స్టిల్ ఆసక్తిని పెంచింది.