మెగా ఫ్యామిలీతో రాక్ స్టార్ దేవి ప్రసాద్ కు ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాభిమానాన్ని దాచుకునేందుకు దేవీ ఎప్పుడూ మొహమాటపడరు. ఎన్నో వేదికలపై మెగా ఫ్యామిలీ గురించి దేవి శ్రీ ప్రసాద్ గొప్పగా చెప్పారు. ఆయనను పిలిచి అవకాశాలిచ్చేందుకు మెగా కాంపౌండ్ వెనకాడదు. దేవీ తండ్రి గారైన రచయిత కీ.శే సత్యమూర్తితో చిరుకి ఉన్న సాన్నిహిత్యం అనుబంధం అలాంటివి.
చిరు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్.. శంకర్ దాదా జిందాబాద్ సహా ఖైదీనంబర్ 150 చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించారు. చరణ్ నటించిన పలు చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ ని దేవీ అందించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లకు ఉన్న బాండింగ్ ఇంకా ప్రత్యేకమైనది. `ఆర్య` నుంచి మొదలైన వాళ్ల ప్రయాణం `పుష్ప` వరకూ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించి..మ్యూజికల్ గా ఎన్నో విజయాలు అందించారు. బన్నీ సినిమాల క్రేజును పెంచడంలో దేవి శ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అందుకే దేవి శ్రీ ప్రసాద్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం..అభిమానం..ప్రత్యేకత. ఆ అభిమానంతోనే తాజాగా బన్నీ...తన స్నేహితుడు సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ కి ఒక లైటింగ్ నియాన్ ని బహుమతి పంపించారు. దానిపై రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అని రాసి ఉంది. ఆ లైటింగ్ మధ్య లో పెద్ద అక్షరాలతో డీఎస్ పీ అని రాసారు. ఆ బహుమతి చూసి దేవి శ్రీ ప్రసాద్ తెగ సంబరపడిపోయారు. బన్నీ నుంచి ఇలాంటి బహుమతి ఊహించనది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా ప్రియమైన బన్నీ బ్రదర్ ధన్యవాదాలు! అంటూ ట్విటర్ వేదికగా తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ఫ` చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. `పుష్ఫ` పాటలతో పాటు సినిమాలో రీరికార్డింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ తెలిపింది. ఈ క్రేజీ కాంబినేషన్ గతంలో తెరకెక్కించిన చిత్రాలను మించి రాక్ స్టార్ బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గంధపు చక్కల స్మగ్లింగ్.. మాస్ యాక్షన్ నేపథ్యంలోని ఈ సినిమాకి రీరికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఓ దశలో హీరో విలన్ మధ్య భీకర పోరాటాలకు ఎలివేషన్ తెచ్చేది ఆర్.ఆర్. మైండ్ గేమ్ నేపథ్యంలో ఎలివేషన్ కి ఆస్కారం ఉన్న సన్నివేశాల్లో విలన్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. పుష్పలో బన్ని వర్సెస్ ఫహద్ సీన్స్ గగుర్పొడిచే రేంజులో ఉంటాయనే అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ మూవీకి రాక్ స్టార్ రీరికార్డింగ్ పరంగా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది.
పుష్ప డ్యూయాలజీ కేటగిరీలో తెరకెక్కుతోంది. అయితే వెంట వెంటనే కాకుండా కొంత గ్యాప్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప పార్ట్ -1 పూర్తి చేశాక ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో ఐకన్ లో నటిస్తారు. ఐకన్ పూర్తి చేశాక తిరిగి సుకుమార్ తో పుష్ప 2 చేస్తారు. పుష్ప 2 చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తారు. ఇక దేవీశ్రీ ఇతర స్టార్ హీరోలకు సంగీతం అందిస్తూ కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.