కిలాడీ అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన `బెల్ బాటమ్` ఈనెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే సాహసోపేతమైన చర్యగానే ఈ రిలీజ్ ని చెప్పాలి. థియేటర్లు పాక్షికంగా తెరవడం ఒక సమస్య కాగా.. క్రైసిస్ వల్ల జనాలు వస్తారా.. రారా? అన్న రకరకాల సందేహాల నడుమ సినిమా రిలీజ్ అయింది. అయితే కరోనా థర్డ్ వేవ్ భయం.. థియేటర్లు సంపూర్ణంగా తెరకపోవడం.. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు.. ముంబైలో థియేటర్లు మొత్తం మూసేసిన సందర్భంలో రిలీజయింది... తొలి రోజే హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో వైరల్ అవ్వడం కూడా బెల్ బాటమ్ ని గట్టిగానే దెబ్బకొట్టినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దీనికి తోడు సమీక్షల్లోనూ కొంత డివైడ్ టాక్ రావడం వసూళ్లపై ప్రభావం చూపినట్లు అయింది. అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అయిందంటే? తొలి రోజు 20 కోట్లు వసూళ్లను రాబడుతాయి. కానీ బెల్ బాటమ్ కేవలం మొదటి 3 కోట్లు మాత్రమే రాబట్టింది. పై కారణాలతో సినిమా వసూళ్లు ఇంత దారుణంగా పడిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కిలాడీ కెరీర్ లో ఇప్పటివరకూ ఏ సినిమా ఇంత లీస్డ్ వసూళ్లు సాధించలేదని చెబుతున్నారు. అక్షయ్ కుమార్ ఇప్పటివరకూ 146 సినిమాల్లో నటించారు. కానీ ఏ సినిమా ఇంత దారుణమైన వసూళ్లకు పడిపోలేదని అంచనా వేస్తున్నారు. కిలాడీ గత సినిమా వసూళ్లను టాలీ చేసి చూస్తే ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో బెల్ బాటమ్ అప్ కమింగ్ రిలీజ్ లకు ఓ హెచ్చరికలా నిలిచింది. థర్డ్ వేవ్ భయం తగ్గుతోంది...ఆంక్షల నుంచి పూర్తి స్థాయిమినహాయింపులు వస్తున్నాయి అనుకుంటోన్న సమయంలో బెల్ బాటమ్ థియేటర్ వసూళ్లు చూసి బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్మాతల ఆలోచనల్లో మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థియేటర్ రిలీజ్ కన్నా సేఫ్ గా ఓటీటీకి వెళ్లిపోవడమే ఉత్తమంగా భావించే ఛాన్సెస్ కొంతవరకూ కనిపిస్తున్నాయి. అయితే బెల్ బాటమ్ రిజల్ట్ ని టాలీవుడ్ కి అన్వయించడానికి లేదు. ఇది సరైనది కాదు. నార్త్ లో జనం ఓటీటీలకు ఇచ్చిన ప్రాధాన్యత థియటర్లకు ఇస్తున్నట్టు లేదు. హిట్ టాక్ వచ్చినా థియేటర్లకు కదిలి రావడం లేదు. నిజానికి ఉత్తరాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో జనం థియేటర్లకు రావడానికి భయపడడం లేదు. ఇక్కడ టిక్కెట్టు ధరలతోనే అసలు సమస్య. అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే జనాల్ని థియేటర్లకు రప్పించే వీలుంటుంది. ఇక ఇటీవల రిలీజైన రాజ రాజ చోర విజయం సాధించడం టాలీవుడ్ కి కొంతవరకూ ఊపు తెస్తోందనే చెప్పాలి. శ్రీవిష్ణు కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందని టాక్ వినిపించడం నిజంగా ఈ క్రైసిస్ కాలంలో గొప్ప ఊరట అనే విశ్లేషకులు భావిస్తున్నారు.