మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేళ రకరకాల ట్విస్టులు టర్నులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరో మూడు రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరికి వారు పోటీబరిలో ప్రచారంతో వేడి పెంచుతున్నారు. దీంతో పాటే వివాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకరినొకరు కించపరుచుకునే కామెంట్లతో విరుచుకపడడం విమర్శించుకోవడం వగైరా రచ్చ చూస్తున్నదే.
అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణు ఒకరి నొకరు మీడియా వేదికగా దూషించుకుంటున్నారు. హీరో రాజశేఖర్ తన తండ్రిని కలిసి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు అంటూ విష్ణు వివరిస్తుండగా ఇప్పుడు అవన్నీ వద్దని జీవిత అన్నారు.
``నా భర్త రాజశేఖర్ మోహన్ బాబుని కలిసిన మాట నిజమే.. రాజశేఖర్ హీరోగా ఆర్.ఎఫ్.సి లో ఓ సినిమా చిత్రీకరణ చేస్తున్నాం. ఓరోజు షూటింగుకి అరగంట ఆలస్యంగా వస్తానని అన్నారు. ఎందుకు? అని అడిగితే .. మార్గం మధ్యలో మోహన్ బాబు గారి ఇల్లు ఉంది. వెళ్లి కలిసి వస్తాను అన్నారు. పరిశ్రమలో చిరంజీవి వర్గం వర్సెస్ మోహన్ బాబు వర్గం అంటూ ప్రచారం సాగుతోంది. అసలు ఇలాంటి వివాదాలేవీ వద్దని కోరతానని రాజశేఖర్ అన్నారు..`` అని జీవిత తెలిపారు.
తన తప్పు లేకుండా నరేశ్ తనని సస్పెండ్ చేస్తానంటూ నరేశ్ చేసిన వ్యాఖ్యలపైనా జీవిత కౌంటర్ వేసారు. `ఓటు వేయకండి` అని సభ్యులకు సూచించానని.. అందుకు నన్ను సస్పెండ్ చేస్తానని నరేశ్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎలా సస్పెండ్ చేయగలడు? పోస్టల్ బ్యాలెట్ పై నేను చేసిన మొత్తం వ్యాఖ్యలను వదిలేసి కేవలం `ఓటు వేయకండి` అన్న పదాన్ని మాత్రమే హైలైట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎలా సస్పెండ్ చేస్తారో చేయమనండి .. భయపడేదేముంది అని అన్నారు.