రానా వెరైటీ సినిమాలు.. ఇన్నాళ్లకు ఆన్సర్ దొరికేసింది..!
సాధారణంగా సినీ పరిశ్రమకు సంబందించి తన వారసులు స్టార్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ అదరగొట్టాలని చూస్తారు.
సాధారణంగా సినీ పరిశ్రమకు సంబందించి తన వారసులు స్టార్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ అదరగొట్టాలని చూస్తారు. కానీ బడా నిర్మాణ సంస్థ నుంచి వచ్చి సినిమాకు పని వస్తుంది అంటే చిన్న పాత్ర కూడా చేసేలా సిద్ధంగా ఉంటాడని రానాని చూస్తేనే అర్థమవుతుంది. మూవీ మొఘల్ రామానాయుడు మనవడిగా తెరంగేట్రం చేసిన రానా తొలి సినిమా లీడర్ తోనే తన కథల ఎంపిక ఎలాంటిదో చూపించాడు.
తొలి సినిమా కదా వెరైటీ కథ ఉండాలని అలా చేశాడేమో అనుకున్నారు కానీ రానా ఫిల్మోగ్రఫీ చూస్తే ఎక్కడ తానొక స్టార్ హీరో అవ్వాలని కావాలని కమర్షియల్ సినిమా చేసినట్టు అనిపించదు. మధ్యలో రానాతో కాస్త రఫ్ లుక్ తో ఒకటి రెండు అటెంప్ట్ లు చేసినా సరే ఎక్కువగా తనకు కొత్త సినిమా కొత్త కథలతోనే ప్రేక్షకులను మెప్పించాలని ఉందని నిరూపించాడు. అందుకే హీరోగానే కాదు కథాబలం ఉన్న సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు రానా.
బాహుబలిలో భళ్లాలదేవాగా అదరగొట్టిన రానా ఆ సినిమాకు ఒక బలమైన స్ట్రెంగ్త్ గా నిలబడ్డాడు. మరోపక్క భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ పాత్ర కూడా అలాంటిదే. బలమైన హీరోకి అంతే బలమైన విలన్ ఉండాలి అందుకే రానా సినిమాలో హీరో కన్నా ప్రతినాయకుడి పాత్రకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఐతే లేటెస్ట్ గా తన సినిమాల ఎంపికలో కొత్త సీక్రెట్ బయట పెట్టారు రానా. తాను ఈ కమర్షియల్ రేసుని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో వెరైటీ సినిమాలు చేస్తానని అన్నారు రానా.
అమేజాన్ ప్రైమ్ తో చేతులు కలిపి రానా ఒక డిఫరెంట్ సెలబ్రిటీ చిట్ చాట్ షో ప్లాన్ చేస్తున్నారు. ఈ షో ప్రోమో ఈమధ్యనే రిలీజ్ చేయగా రానా ఆ షో గురించి మరిన్ని విషయాలు రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాతా గారి టైం లో సినిమాలు కేవలం ప్రేక్షకులు సినిమాల ద్వారానే ఎంటర్టైన్ అయ్యేవాళ్లు.. నాన్న గారి హయాంలో టీవీలు, మ్యూజిక్ సిస్టెం లు వచ్చాయి. ఇప్పుడు సినిమాతో పాటుగా చాలా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు. అందుకే వారికి తగినట్టుగా ట్రెండ్ ఫాలో అవ్వాలని అంటున్నారు రానా.
రానా చేస్తున్న టాక్ షో ప్రోమో తోనే సూపర్ బజ్ ఏర్పడింది. కచ్చితంగా ఈ టాక్ షోకి మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో డిజిటల్ ఇంటర్వ్యూస్ లో నంబర్ 1 గా ఉండగా రానా దాన్ని బ్రేక్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.