అన్ స్టాపబుల్ హంగామా.. స్నేహితులతో బాలకృష్ణ సందడి..!

Update: 2022-11-18 08:30 GMT
చూడు ఒక వైపే చూడు మరో వైపు చూడాలని అనుకోకు అనే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తనలోని మరో యాంగిల్ చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. బాలయ్య ఇంత సరదా మనిషా.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఇలా ఉంటుందా.. ఆయన పక్కన వారితో ఇంత సరదాగా ఉంటారా అని ఆ షో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే అసలు బాలకృష్ణ ఇలానే ఉంటాడు. కేవలం సినిమాల్లో భారీ డైలాగులు.. పబ్లిక్ లో కొద్దిగా రుస రుసలాడుతుం కనిపించడంతో బాలయ్య కొపిష్టి అన్న ముద్ర వేశారు కానీ కానీ బాలయ్య ఎప్పుడు ఇలానే సరదాగా ఉంటారని తెలుస్తుంది.

అన్ స్టాపబుల్ షో నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు బాలకృష్ణ గురించి నెగటివ్ గా మాట్లాడే వారిని కూడా అలరించింది. అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ హిట్ కాగా సీజన్ 2 రీసెంట్ గా కూడా సంచలనాలు సృష్టిస్తుంది. సీజన్ 2 ఆరంభమే పొలిటికల్ ఫ్లేవర్ తీసుకొచ్చారు బాలయ్య.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సీజన్ 2 ఫస్ట్ ఇంటర్వ్యూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది సూపర్ హిట్ అవడంతో ఈ సీజన్ పొలిటికల్ లీడర్స్ తో షో ప్లాన్ చేశారు. సీజన్ 2 నాల్గవ ఎపిసోడ్ లో బాలకృష్ణ స్నేహితులు ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ సురేష్ రెడ్డి ఇద్దరు అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.  

తను స్పీకర్ అయిన అర్ధారాత్రి 12 గంటలకు బాలకృష్ణ ఫోన్ చేశాడని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. లేటెస్ట్ గా ఈ ఎపిసోడ్ కి సంబందిచిన ప్రోమో రిలీజైంది. కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య క్రికెట్ కూడా ఆడాడు. ఇక ఈ ఎపిసోడ్ లో కొసమెరుపుగా సీనియర్ హీరోయిన్ రాధిక కూడా ఎంట్రీ ఇచ్చారు. రాధికని తన సరదా ప్రశ్నలతో ఆడుకున్నారు బాలకృష్ణ.  

ప్రోమోలో హైలెట్ ఏంటంటే చిరంజీవిలో నచ్చని.. తనలో నచ్చేది ఏంటని రాధికని అడిగారు బాలయ్య. చిరుతో ఎక్కువ సినిమాలు చేసిన రాధికకు ఒక రకంగా ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్నే.. ఆ ప్రశ్నకు ఏమని సమాధనం చెప్పిందో ఎపిసోడ్ లోనే చూడాలి. మొత్తానికి ప్రోమోతోనే తన స్నేహితులతో అన్ స్టాపబుల్ హంగామా చేశారు బాలయ్య. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిల లాంటి పొలిటిషియన్స్ మధ్య హీరోయిన్ రాధికని ఈ ఎపిసోడ్ కి ఎందుకు తీసుకొచ్చారు అన్నది చర్చ జరుగుతుంది.

కేవలం పొలిటికల్ చిట్ చాట్ లా కాకుండా సినీ గ్లామర్ ఉంటేనే వ్యూస్ బాగా వస్తాయన్న ఆలోచనతో అలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఎంతోమంది సూపర్ స్టార్స్ తో నటించిన రాధిక తనతో సినిమా ఎందుకు చేయలేదు అన్న ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ లో ఆన్సర్స్ దొరుకుతాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News