ఓవ‌ర్సీస్‌ లో 'వీరసింహారెడ్డి' అన్ స్టాప‌బుల్ రికార్డ్!

Update: 2023-01-11 07:34 GMT
సంక్రాంతికి భారీ సినిమాలు పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. మూడు తెలుగు సినిమాల‌తో పాటు రెండు త‌మిళ డ‌బ్బింగ్ మూవీస్ ఈ సంక్రాంతికి పోటీ ప‌డుతున్నాయి. ఇందులో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఊర మాసీవ్ ఎంట‌ర్ టైన‌ర్ కూడా వుంది. ఇందులో త‌మిళ డ‌బ్బింగ్ మూవీ 'తెగింపు'తో సంక్రాంతి సంద‌డి థియేట‌ర్ల వ‌ద్ద మొద‌లైంది. 12న నంద‌మూరి బాల‌కృష్ణ 'వీర సింహారెడ్డి' రిలీజ్ కాబోతోంది.

ఆ త‌రువాతే జ‌న‌వ‌రి 13న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌' బ‌రిలోకి దిగుతోంది. ఇప్ప‌టికే విజ‌య్ హీరోగా న‌టించిన 'వార‌సుడు', అజిత్ న‌టించిన 'తెగింపు'  డ‌బ్బింగ్ సినిమాల‌కు సంబంధించిన టాక్ బ‌య‌టికి రావ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి టాలీవుడ్  అగ్ర‌హాలు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య‌'ల‌పైనే వుంది. ఈ రెండు సినిమాల్లో బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి' జ‌న‌వ‌రి 12న మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ యుఎస్ ప్రీమియ‌ర్ షోలు మ‌రి కొన్ని గంట‌ల్లో ప‌డ‌బోతున్నాయి. తొలి సారి యుఎస్ లో బాల‌య్య సినిమాకు హ్యూజ్ క్రేజ్ ఏర్ప‌డింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్డ్ ప్రీమియ‌ర్స్ కోసం ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్ప‌డింద‌ని ఇప్ప‌టికే భారీ స్థాయిలో ప్రీమియ‌ర్స్ కోసం టికెట్స్ అమ్ముడు పోయాయని 287 లొకేష‌న్ ల‌లో ఈ మూవీ ప్రీమియ‌ర్ షోల కు అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగా 525 కె డాల‌ర్ల‌ని రాబ‌ట్టిన‌ట్టుగా చెబుతున్నారు.

అంటే ఇప్ప‌టికే ప్రీమియ‌ర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 'వీరి సింహారెడ్డి' హాఫ్ మిలియ‌న్ మార్క్ ని దాట‌డం విశేషం. బాల‌య్య సినిమాల్లో ఇది రికార్డు గా చెబుతున్నారు. అంటే అడ్వాన్స్డ్ ప్రీమియ‌ర్ ల‌తో బాల‌య్య యుఎస్ లో అన్ స్టాప‌బుల్ గా సింహా గ‌ర్జ‌న మొద‌లు పెట్టార‌న్న‌ట్టే అని తెలుస్తోంది. గ‌తంలో బాల‌కృష్ణ న‌టించిన 'ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు' 473కె, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి 375కె, అఖండ 331కె మాత్ర‌మే సాధించ‌గా 'వీర సింహారెడ్డి' మాత్రం అడ్వాన్స్డ్ ప్రీమియ‌ర్స్ తో రికార్డుని సృష్టించ‌డం విశేషం.

ఇదిలా వుంటే జ‌న‌వ‌రి 13న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య' రిలీజ్ కాబోతోంది. 12న యుఎస్ ప్రీమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి. 274 ఏరియాల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ ప్రీమియ‌ర్స్ ద్వారా 398 కె మాత్ర‌మే రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అంటే బాల‌య్య కంటే చిరు ఈ విష‌యంలో చాలా వెన‌క‌బ‌డి వున్నాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News