బర్త్ డే ఉపాసన ఇచ్చిన బహుమతి..

Update: 2018-03-27 15:30 GMT
రామ్ చరణ్.. అటు హీరోగాను ఇటు నిర్మాతగాను కెరీర్లో బాగానే సెటిల్ అయ్యాడు. ధ్రువ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ గతేడాది నిర్మించిన తన తండ్రి చిరంజీవి కం బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ఆనందంగా ఉన్న ఈ మెగా హీరో ఇవాళ తన 33వ పుట్టినరోజు జారుపుకుంటున్నాడు.

అపోలో చారిటీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అయిన ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మెగా పవర్ స్టార్. మరి ఆమె చెర్రీ పుట్టినరోజుకు ఏ బహుమతి ఇచ్చిందో తెలుసా? ఉపాసన సోషల్ మీడియాలో బాగా యక్టీవ్ గా ఉంటూ తన భర్త గురించిన విషయాలు కూడా ఫాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అలానే తను చరణ్ కి ఇచ్చిన గిఫ్ట్ కూడా వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పువ్వులతో 'హ్యాపీ బర్త్ డే మిస్టర్ సి' అని అలంకరించింది. ఆమె దాదాపు అన్ని పోస్టులలోను రామ్ చరణ్ ను మిస్టర్ సి గానే సంబోధిస్తుందనే విషయం తెలిసిందే.

ఇక్కడ మరో వెరైటీ ఏంటంటే.. అసలు ఒక ప్రక్కన తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం చరణ్‌ బిజీగా ఉంటే.. అదే సమయంలో ఉపాసన కూడా కొన్ని చానెళ్ళకు ఇంటర్యూలు ఇస్తోంది. ఈ సందర్బంగా తన లైఫ్‌ స్టయిల్ గురించి.. ఇతర విషయాల గురించి చెబుతూ హడావుడి చేస్తోంది. మొత్తానికి ఉపాసన ఏ విషయంలోనైనా భలే స్పెషల్ అనిపించుకుంటోంది.


Tags:    

Similar News