వృద్ధాశ్రమంలో ఉపాసన.. సేవాగుణంతో ప్రశంసలు పొందుతున్న మెగా కోడలు..!

Update: 2022-05-02 14:30 GMT
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే.. బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌ గా వ్యవహరిస్తోంది. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ నిర్వహిస్తూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకొంటూ ఉంటారు.

సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన.. అందరిలో ప్రత్యేకంగా నిలిచారు. తన సేవా గుణంతో సాటి వారికి వీలైనంత చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తూ వస్తున్నారు.

అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా పాండమిక్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది ఉపాసన. మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం - వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఆమె ఛారిటీలు చేస్తుంటారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు ఉపాసన. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు - ఆహార పదార్థాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అపోలో ఫౌండేషన్ లో భాగమైన బిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఉపాసన.. ఢిల్లీ - తమిళనాడు - కర్నాటక - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150 వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు.

తాజాగా వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు ఉపాసన. వాళ్లతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచారు. అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన తమ వద్దకు వచ్చి మాట్లాడటంతో ఆ వృద్ధులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వృద్దులతో సరదా సమయం గడిపిన ఉపాసన ఫోటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నారు. మెగా కోడలు చేస్తున్న సేవా కార్యక్రమాలపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. అందరూ ఆమె మంచి మనసును కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tags:    

Similar News