మెగా ఫ్యామిలీ.. మెగా ఎంజాయ్మెంట్ అదుర్స్

Update: 2017-02-11 13:03 GMT
మెగా ఫ్యామిలీలో చాలా మందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. సాయి ధరం తేజ్.. వరుణ్ తేజ్.. చిరు డాటర్స్.. ఇలా చాలామందే సోషల్ మీడియాలో ఉన్నా.. అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉండేది మాత్రం.. చెర్రీ వైఫ్ ఉపాసన.

హెల్త్ టిప్స్ ఇవ్వడంతో పాటు.. మెగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకునేందుకు తన ట్విట్టర్ అకౌంట్ ను తరచుగా ఉపయోగిస్తుంటుంది ఉపాసన. దాదాపుగా మెగా ఫ్యామిలీ వేడుకలు అన్నిటినీ మొదట రివీల్ చేసేది ఈమే. తాజాగా ఫ్యామిలీ వెడ్డింగ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది చెర్రీ వైఫ్. కుటుంబ సభ్యులు అంతా ఆ పెళ్లిలో ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన భార్య సురేఖ కూడా ఈ ఫోటోల్లో ఉండడం విశేషం.

మెగాఫ్యామిలీ.. కామినేని ఫ్యామిలీలు మొత్తం ఈ పెళ్లిలో సందడి చేశారు కానీ.. ఇంతకీ ఎవరి పెళ్లో చెప్పలేదు ఉపాసన. 'ఫ్యామిలీ వెడ్డింగ్.. జీవితంలో అనుబంధాలు పెంచుకునేందుకు అనువైన సమయం. ఇలాంటి స్నేహితులు.. కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేసిన ఉపాసన.. త్వరలో మరిన్ని ఫోటోలను పోస్ట్ చేస్తానని చెప్పింది.
Tags:    

Similar News