ఆనందానికి ఉపాస‌న ఎంచుకున్న ఏకైక మార్గం?

Update: 2021-07-28 01:30 GMT
నిరంత‌రం అపోలో హెల్త్ కార్య‌క‌లాపాల‌తో బిజీగా ఉండే ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ లో ఆధ్యాత్మిక భావ‌జాలం ప్ర‌తిసారీ బ‌య‌ట‌పడుతూనే ఉంది. ఇంత‌కుముందు 800 ఏళ్ల నాటి అత్యంత పురాత‌న‌మైన‌ దోమ‌కొండ శివాల‌యంలో పూజ‌లాచ‌రించారు. ఉపాస‌న - చ‌ర‌ణ్ జంట ఈ పూజా కార్య‌క్ర‌మాల‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆచ‌రిస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు కూడా ఉపాస‌న ఓ అరుదైన ప‌విత్ర స్థ‌లాన్ని సందర్శించారు. స్పాట్ లో గౌత‌మ బుద్ధుని పురాత‌న ఆల‌యాలు .. పాడుబ‌డిన కోట‌లు క‌నిపిస్తున్నాయి. ఇది చాలా పురాత‌న‌మైన అరుదైన ఆధ్యాత్మిక స్థ‌లం అని అర్థ‌మ‌వుతోంది. అక్క‌డ ఉపాస‌న ధ్యాన‌ముద్ర‌లో ఉన్నారు.

``వినయం కృతజ్ఞతతో జీవితాన్ని అంగీకరించడం అవ‌స‌రం.. తలుపులు  అందరికీ తెరవబడతాయి. తాత్వికమైనది కాదు-కేవలం ఆచరణాత్మకమైనది!`` అంటూ అద్భుత‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర అనంత‌రం ఉపాస‌న తిరిగి య‌థావిధిగా త‌న వృత్తిప‌ర‌మైన వ్య‌వ‌హారాల్లో చేర‌తారు. రామ్ చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీ గ‌నుక‌.. ఈ విహార యాత్ర‌కు వెళ్లే అవ‌కాశం ఉందా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News