దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన విజువల్ వండర్ ట్రిపుల్ ఆర్ రానే వచ్చేసింది. థియేటర్లకు దేశ వ్యాప్తంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల పాటు ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ శ్రమించి చేసిన భారీ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25న శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. బెనిఫిట్ షోలతో అర్థ్రరాత్రి నుంచే ట్రిపుల్ ఆర్ హంగామా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఇప్పటికే మూవీ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఓవర్సీస్ లోనూ షోలు పడిపోవడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది.
పాన్ ఇండియా రేంజ్ లో ఇక రికార్డుల మోత మొదలైనట్టేనంటూ ట్రేడ్ వర్గాలు అప్పుడే లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ఇప్పడు ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ట్రిపుల్ ఆర్ చర్చే నడుస్తోంది. అంతగా ప్రభావితం చేస్తున్న ఈమూవీని థియేటర్లలో చూడాలని జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలఖరు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు పూర్తియిపోయాయి. ఇప్పుడు మిస్సయిన వారు మరో వారం వరకు వేయిట్ చేయక తప్పని పరిస్థితి.
ఆ రేంజ్ లో ట్రిపుల్ ఆర్ మేనియా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కొంత మంది క్రిటిక్స్ ఎర్లీమార్నింగ్ షో చూసేసి రేటింగ్ ఇచ్చేశారు. బాలీవుడ్ క్రిటిక్ లు కూడా ఈ సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసి నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఏఎంబీ బాల్ లో ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో ని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సోదరులు ఫ్యామిలీస్ తో కలిసి వీక్షించారు.
దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ ఎప్పటి లాగే ముందు అనుకున్నట్టుగానే కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.
రామ్ చరణ్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ , ఉపాసన థియేటర్ లో సందడి చేశారు. థియేటర్ లో సినిమా చూస్తూ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అభిమానిగా మారిపోయిన ఉపాసన అభిమానులతో కలిసి పేపర్స్ విసురుతూ హల్ చల్ చేశారు. రామ్ చరణ్ సన్నివేశాలు వచ్చిన ప్రతీ సారి ఓ అభిమానిలా అరుస్తూ స్క్రీన్ పై పేపర్లు చల్లుతూ.. వెనకాల కూర్చున్న రామ్ చరణ్ పై చల్లుతూ ఫ్యాన్స్ లా అరుస్తుంటే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది. మెగా కోడలు ఫ్యాన్ గా మారిపోయి ట్రిపుల్ ఆర్ థియేటర్ లో చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'వకీల్ సాబ్' మూవీ రిలీజ్ అయిన రోజు తనని తాను మరిచిపోయి దిల్ రాజు స్క్రీన్ పై పేపప్లు చించి విసిరేస్తూ చేసిన హంగామా అందరికి తెలిసిందే. మళ్లీ అదే స్థాయిలో రామ్ చరణ్ కోసం ఉపాసన భ్రమరాంబ థియేటర్లో హల్ చల్ చేయడం విశేషం.