ప్రైమ్‌ వీడియోలో 2022లో రానున్న బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు

Update: 2022-02-02 03:30 GMT
ఇండియన్ ఓటీటీ మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది. 2020 మరియు 2021 లో దాదాపుగా మూడు నాలుగు రెట్ల బిజినెస్ పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2020 కి ముందు ఉన్న ఓటీటీ సబ్‌ స్క్రైబర్స్ సంఖ్య తో పోల్చితే ఇప్పుడు ఉన్న సంఖ్య ప్రతి ఓటీటీకి కూడా చాలా మార్పు ఉంది. అమెజాన్‌ కు అనూహ్యంగా రెట్టింపు స్థాయిలో సబ్‌ స్క్రైబర్స్ అయ్యారు అనేది సమాచారం. సబ్‌ స్క్రైబర్స్ పెరుగుతున్నా కొద్ది క్వాలిటీ కంటెంట్‌ ఇవ్వాలనే పట్టుదలతో అమెజాన్‌ ప్రైమ్‌ మరింతగా ఖర్చు పెడుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడాది ఏడాదికి సినిమాల సంఖ్య ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల సంఖ్య ను అమెజాన్‌ పెంచుకుంటూ పోతుంది. ఈ ఏడాదిలో తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున సినిమాలను ఇప్పటికే కొనుగోలు చేసింది.

తెలుగు సినిమాలు అయిన సర్కారు వారి పాట మరియు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య పోస్ట్‌ థియేట్రికల్‌ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుందట. ఇవి కాకుండా మరి కొన్ని భారీ చిత్రాలను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వారు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు కూడా చర్చలు తుది దశలో ఉన్నాయి. సినిమాలు విడుదల వాయిదాలు పడుతున్న నేపథ్యంలో ఆ ఒప్పందాలు ఆలస్యం అవుతున్నాయి. తాజాగా ప్రముఖ హీరో సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌ కు భారీ మొత్తంకు దక్కినట్లుగా సమాచారం అందుతోంది. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్‌ హీరో నటించిన సినిమా ఒకటి అమెజాన్ సొంతం అయ్యింది. అది మాత్రమే కాకుండా మరిన్ని తమిళ సినిమాలు కూడా అమెజాన్‌ ప్రైమ్‌ కు దక్కాయి.

ఇక హిందీలో పెద్ద ఎత్తున సినిమాలను అమెజాన్ ప్రైమ్‌ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. బచ్చన్‌ పాండే.. షమ్ షేర్‌.. పృథ్వీరాజ్ ఇంకా పెద్ద సినిమాలను అమెజాన్ కొనుగోలు చేసింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత స్ట్రీమింగ్‌ చేయడం కోసం కొనుగోలు చేసేందుకు గాను చర్చలు జరుపుతూనే ఉంది. ఇదే సమయంలో డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ కోసం కూడా అమెజాన్ భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంది. ప్రముఖ హీరోలు నటించిన సినిమాలు టార్గెట్‌ గా అమెజాన్ ప్రైమ్‌ భారీగా బిజినెస్ చేస్తోంది. ఈ ఏడాదిలో భారీ ఎత్తున కొత్త సినిమాలపై పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇదే సమయంలో అమెజాన్‌ తమదైన శైలిలో భారీ వెబ్‌ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో నెట్‌ ఫ్లిక్స్ భారీ గా పెట్టుబడులు పెట్టి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ ఈ దూకుడును ప్రదర్శిస్తుంది.
Tags:    

Similar News