పాండమిక్ టైంలో డిజిటల్ వేదికలు బాగా పుంజుకున్నాయి. ఇంటికే పరిమితమైన జనాలకు వినోద సాధనంగా మారడంతో.. పోటాపోటీగా అనేక ఓటీటీలు పుట్టుకొచ్చాయి. సరికొత్త కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటూ వేటికవే ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాయి.
ఇందులో భాగంగా క్రేజీ చిత్రాల డిజిటల్ హక్కులను భారీ రేట్లకు కొనుగోలు చేశారు. పాండమిక్ తర్వాత డైరెక్ట్ ఓటీటీ రిలీజుల సందడి కాస్త తగ్గినప్పటికీ.. పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు.
ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తెలుగు - హిందీ - తమిళ్.. అలా ప్రతీ భాషలోనూ ప్రముఖ ఓటీటీలు దృష్టి సారిస్తున్నాయి.
భారీ సినిమాల స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేయడంలో నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వీడియో - జీ5 - ఆహా వంటి ఓటీటీలు మిగతా వాటి కంటే కాస్త ముందున్నాయి. నివేదిక ప్రకారం, ఏ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఏయే సినిమాల స్ట్రీమింగ్ భాగస్వామిగా చేరిందో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి భారీ ధరనే చెల్లించినట్లు టాక్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ 'లూసిఫర్' మాత్రం అమెజాన్ ప్రైమ్ వద్ద ఉంది.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా డిజిటల్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీయే దక్కించుకుందని సమాచారం. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. రాబోయే సంక్రాంతికి Mega154 సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'RC15' స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రైట్స్ భారీ రేటు పలికినట్లు టాక్.
తమిళ హీరో కార్తీ నటిస్తున్న 'సర్దార్' సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ గా తెలుగు ఓటీటీ ఆహా చేరింది. విజయ్ మరియు శివ కార్తికేయన్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు 'వారసుడు' & 'ప్రిన్స్' డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అలానే ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న ధనుష్ 'నేనే వస్తున్నా'.. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వద్దనే ఉన్నాయి. ఇటీవలి శింబు బ్లాక్ బస్టర్ మూవీ 'లైఫ్ ఆఫ్ ముత్తు' ను ప్రైమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అజిత్ 'తునివే తునై' - రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2' - ఫహద్ ఫాసిల్ 'మామన్నన్' - విక్రమ్ 61వ సినిమాల స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ చేజిక్కించుకున్నట్లు సమాచారం. శివకార్తికేయన్ నటిస్తున్న 'మహావీరుడు' చిత్రాన్ని మాత్రం అమెజాన్ ప్రైమ్ తీసుకుంది.
హిందీలో షారుక్ ఖాన్ 'జవాన్' మరియు రణవీర్ సింగ్ 'సర్కస్' సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఓటీటీని ఎంచుకున్నాయి. రేపు విడుదల కాబోతోన్న హృతిక్ రోషన్ - సైఫ్ అలీఖాన్ నటించిన 'విక్రమ్ వేద' చిత్రాన్ని వూట్ ఓటీటీ దక్కించుకుంది.
షారూఖ్ ఖాన్ 'పఠాన్' - అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' - సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' వంటి భారీ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో చెంతకు చేరాయని తెలుస్తోంది. ఇలా రాబోయే కొన్ని నెలల పాటు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించాడని ఓటీటీ వేదికలు రెడీ అవుతున్నాయి. మరి వీటిల్లో ఏయే చిత్రాలు ఆదరణ పొందుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.