ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే వారసత్వం గ్యారంటీగా చాలా ఉపయోగపడుతుంది. కానీ అదొక్కదానితో క్లిక్కవడం కష్టం. దాంతోపాటు ప్రమోషన్ కూడా తోడవాలి. అప్పుడే అందరి దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోనే టైంలో న్యూస్ లో పేరు కనిపించాలంటే ఏదో ఒక హడావుడి ఉండాలి.
అందుకే సినిమా షూటింగ్ కు ఖాళీ దొరికితే మీడియా దృష్టిలో పడేందుకు వారసులు ఓ కొత్త మార్గం కనిపెట్టారు. అదేమిటంటే సోషల్ సర్వీస్. పుట్టిన రోజనో.. పండగ రోజనో స్కూళ్లకు వెళ్లి కాస్త టైం గడిపేసి వచ్చేస్తుంటారు. ఏదీ లేకపోతే ప్రభుత్వ పథకాన్ని కాస్త పొగుడుతూ ఏదో ఒక చిన్న పనిచేసినా చాలు... మీడియాలో ఈజీగా హైలైట్ అవుతారు. తాజాగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఆశపడుతున్న ఓ హీరోయిన్ తన పుట్టిన రోజు సందర్భంగా రోజంతా ఇలాగే స్పెండ్ చేసింది. కానీ ఆమె ఇంతకుముందు పుట్టినరోజులు ఎప్పుడూ ఇలా చేసుకున్న దాఖలాల్లేవు.
ఎదుగుతున్నప్పుడు నటీమణులకు ఇలాంటి పనులన్నీ భలే గుర్తొచ్చేస్తాయ్. కాని ఒక స్టార్ అయ్యాక మాత్రం.. ఇలాంటివి ఒక్కటి కూడా చేసినట్లు ఎక్కడా కనిపించరు. లాంచ్ అయ్యే టైంలో చేసిన సేవ తరవాత ఏమయిపోయిందని ఎవరైనా అడిగినా టైం ఉండటం లేదని దాటవేస్తారు. ఇదంతా ఉత్తమ సేవలా కనిపించేలా హడావుడి చేసినా ఇదంతా ఉత్తుత్తి సేవే.