ఒక ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే వరకు ఎన్ని మార్పులకు లోనవుతుందో ఎవరికీ అంతుచిక్కదని 'ఆచార్య' మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా కథ ఎక్కడో ఎవరి కోసమో మొదలై.. ఎక్కడో ఎండవుతోంది. చరణ్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఓ సినిమా చేయాలనుకున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాకు ముహూర్తం కూడా జరిగింది. కానీ ఎందుకో మరో అడుగు పడలేదు. చరణ్ తో కొరటాల అనుకున్న ప్రాజెక్ట్ ఆదిలోనే ఆగిపోవడంతో మళ్లీ కొరటాల ప్రయత్నాలు చేయలేదు.
విషయం తెలిసి చిరంజీవి తనతో సినిమా చేయోచ్చుకదా అని ఆఫర్ ఇచ్చారు. అక్కడే 'ఆచార్య' కథ మొదలైంది. కథ వండటం ప్రారంభించారు కొరటాల శివ.. అది మరో లెవెల్ కి వెళ్లింది. ఇదే కథలో మరో కీలక పాత్ర పుట్టుకొచ్చింది. అది ఎవరు చేస్తే బాగుంటుందనే తర్జనభర్జన మొదలైంది. ముందు 15 నిమిషాల పాటు సాగే గెస్ట్ పాత్ర అనుకున్నారు. మహేష్ ని ఈ పాత్రకు అనుకున్నారు. అదీ కుదరలేదు. చివరికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చరణ్ రంగంలోకి దిగాడు.
దీంతో 15 నిమిషాలు నిడివి అనుకున్న పాత్ర 25 నుంచి 45 నిమిషాలకు పెరిగింది. రెండు పాటలు కీలక ఫైట్ లతో సినిమాలో అర్థభాగాన్ని ఆక్రమించింది. ఇక ఇందులో చరణ్ కు ముందు హీరోయిన్ లేదు. చిరకు మాత్రమే హీరోయిన్ వుంది. ఇందు కోసం త్రిషని ఎంపిక చేసుకున్నారు.
తనకు సినిమాలో సరైన ప్రాధాన్యత లేదని గమనించిన త్రిష తనకు తానే తప్పుకుని 'ఆచార్య' టీమ్ కు షాకిచ్చింది. కానీ చిరు మాత్రం తనకు 'పొన్నియెన్ సెల్వన్' వుందని, ఆ కారణంగానే తాను ఈ సినిమా నుంచి తప్పుకుందని చెప్పుకొచ్చారు.
కానీ త్రిష మాత్రం ఇండైరెక్ట్ గా 'ఆచార్య' టీమ్ పై సెటైర్లు వేసింది. కొంత మంది ఒకటి చెప్పి మరొకటి ఇలా ఎందుకు చేస్తారో అని వాపోయింది. 'ఆచార్య'లో తన పాత్రకు టీమ్ ఇచ్చిన ప్రాధాన్యతని ఇండైరెక్ట్ గా బయటపెట్టి షాకిచ్చింది. ఆ తరువాతే ఆ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈలోగా చరణ్ పాత్ర నిడివి పెరిగింది. దీంతో చరణ్ కు హీరోయిన్ అవసరం ఏర్పడింది. ఆ క్రమంలోనే పూజా హెగ్డేని రంగంలోకి దింపారు. రెండు పాటలు పెట్టారు.
కానీ చిరకు హీరోయిన్ లేకుండా చేశారు. ఫైనల్ గా కాజల్ ని ప్రాధాన్యత లేని పాత్రలో చూపించడం ఇష్టం లేకి ఆమెని తప్పించామని చాలా కూల్ గా దర్శకుడు కొరటాల శివ ఇటీవల అసలు విషయం బయటపెట్టారు. ఇలా సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేసి తొలగించడం మిగతా వాళ్లకు లైట్ గానే అనిపించినా కాజల్ కు మాత్రం ఇది పెద్ద షాక్ అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని ముందే పసిగట్టేసింది కాబట్టే త్రిష చాలా సేఫ్ గా బయటపడిందని.. కానీ కాజల్ మాత్రం ఆ విషయం గుర్తించలేక అడ్డంగా బుక్కైందని అంటున్నారు. ఈ విషయంలో తను సేఫ్ అయినందుకు ప్రస్తుతం త్రిష హ్యాపీగా ఫీలవుతోందట.