'పోకిరి' .. తెలుగు తెరపై ఒక ట్రెండ్ సెట్టర్. సరిగ్గా ఈ సినిమా విడుదలై ఈ రోజుకి 16 ఏళ్లు పూర్తయ్యాయి. 2006 ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఇటు పూరి జగన్నాథ్ కెరియర్లోను .. అటు మహేశ్ బాబు కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాగా 'పోకిరి' నిలిచింది. ఇటు యూత్ కీ ... అటు మాస్ కి ఒక రేంజ్ లో ఈ సినిమా కనెక్ట్ అయింది. ఇక అదే స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు చాలా హాండ్సమ్ గా కనిపిస్తాడు. ఇక ఇలియానా గ్లామర్ కుర్రాళ్ల మతులుపోగొడుతుంది.
పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఈ సినిమా కి హైలైట్ గా నిలిచాయి. 'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు' అనే డైలాగ్ ఒక రేంజ్ లో పాప్యులర్ అయింది. పూరి జగన్నాథ్ తో పాటు మహేశ్ సోదరి మంజుల ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఒక వైపున ప్రకాశ్ రాజ్ ట్రాక్ తో .. మరో వైపున బ్రహ్మానందం ట్రాక్ తో .. ఇంకో వైపున ఆశిష్ విద్యార్థి ట్రాక్ తో పూరి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను అందించాడు. కథలో ఎక్కడ అనవసరమైన సీన్ గానీ .. డైలాగ్ గాని కనిపించవు. అంత పద్ధతిగా కథాకథనాలను పూరి నడిపించాడు.
మణిశర్మ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఒక పాటను మించి మరో పాట సందడి చేస్తూ సాగిపోతుంటాయి. మొత్తంగా చూసుకుంటే ఇదో ఒక పాటల పండగలా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇలియానా మెరుపుతీగకు మీగడ అద్దినట్టుగా కనిపిస్తుంది.
మహేశ్ బాబు సరసన ఆమె కరెక్టుగా సెట్ అయిందని అంతా అనుకున్నారు. అయితే నిజానికి ఈ సినిమా కోసం ముందుగా వాళ్లు ఇలియానాను అనుకోలేదు. ఆ ఆమె పేరును పరిశీలించినదీ .. ఆమెను ఖరారు చేసినది ఆఖరులోనే.
ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కంగనా రనౌత్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఆమె కోసం గట్టిగానే ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వలన, ఈ ఆఫర్ ను తిరస్కరించింది. దాంతో ఈ సినిమా టీమ్ మళ్లీ వెతులాటలో పడింది. ఎవరైతే బాగుంటారా అనే అన్వేషణ భారీస్థాయిలోనే కొనసాగింది.
దీపిక పదుకొణెను .. ఆయేషా టకియాను .. పార్వతీ మెల్టన్ ను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు. అయితే ఎవరికివారు ఏదో ఒక కారణాన్ని చూపించి, ఈ సినిమాను చేయలేకపోతున్నామని చెప్పారు. ఈ సినిమా ఇంతటి సంచలనాన్ని సృష్టిస్తుందనే విషయాన్ని వాళ్లు ఎంతమాత్రం ఊహించి ఉండరు. లేకపోతే వాళ్లు అలా చెప్పేవారు కాదేమో. ఆ తరువాతనే అవకాశం ఇలియానా ఇంటి గుమ్మం తొక్కిందన్నమాట!