'ఆషిఖి-3'లో కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న దీపిక‌?

Update: 2022-11-17 04:05 GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ 'ఆషిఖి' సిరీస్ లో సీక్వెల్స్ రాక‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. త‌దుప‌రి ఆషిఖి 3 చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆషిఖి 2 లో శ్ర‌ద్ధాక‌పూర్- ఆదిత్య రాయ్ క‌పూర్ జంట‌గా న‌టించ‌గా ఈసారి పార్ట్ 3లో కార్తీక్ ఆర్య‌న్ ని హీరోగా ఫైన‌ల్ చేశారు. అత‌డి స‌ర‌స‌న ప‌లువురు క‌థానాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. గ‌త కొంత‌కాలంగా పాపుల‌ర్ ఫ్రాంఛైజీలోకి దీపిక ప‌దుకొనే లాంటి స్టార్ హీరోయిన్ ప్ర‌వేశించింద‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అన్నీ కుదిరితే కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న దీపిక న‌టించే ఛాన్సుంద‌ని వార్త‌లు గుప్పుమన్నాయి. కానీ దీపిక ప్ర‌వేశాన్ని ఇంకా అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

తాజాగా అవార్డ్ షోలో దీపికా పదుకొనే- కార్తీక్ ఆర్యన్ కెమిస్ట్రీ ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది. ఈ జంట అంద‌రి హృదయాలను గెలుచుకున్నారు. ఆ ఇద్దరి నడుమా ర్యాపోని ప‌రిశీలించాక ఈ జంట‌ను 'ఆషిఖి 3'కి ఫిక్స్ చేశార‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి. దీనిని ధృవీక‌రించేందుకే.. హింట్ ఇచ్చేందుకే ఈ జంట ఇలా అవార్డుల వేదిక‌పై త‌ళుక్కుమంద‌న్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ దీపికా పదుకొణె .. క్రౌడ్-పుల్లర్ కార్తీక్ ఆర్యన్ జంట‌గా న‌టిస్తే చూడాల‌నేది అభిమానుల చిర‌కాల‌ కోరిక‌. ఇలాంటి స‌మ‌యంలో ఇలా అవార్డుల కార్యక్రమంలో ఈ జంట‌ కలిసి పోజులిచ్చారు. దీంతో ఒక్క‌సారిగా అగ్గి రాజుకుంది. ఈ జంట‌ అద్భుతమైన కెమిస్ట్రీతో హృదయాలను గెలుచుకున్నారు. ''జంట బావుంది... క‌ల‌సి న‌టిస్తే ఇంకా బావుంటుంద‌''ని అభిమానులు త‌మ ప్రేమ‌ను కురిపిస్తూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.

అవార్డుల వేదిక‌పై దీపిక‌ వైట్ టల్లే స్కర్ట్ -మోనోక్రోమ్ షర్ట్ లో అద్భుతంగా కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రౌడ్-పుల్లర్ కార్తీక్ ఆర్యన్ ఎంట్రీ ఇచ్చాక‌.. దీపికా పదుకొనే వేదికపైకి ప్రవేశించింది. కార్తీక్ దీపికను హృదయపూర్వకంగా చిరునవ్వుతో స్వాగతించాడు. ఇద్దరూ కలిసి ఫోటోషూట్ల‌కు పోజులిచ్చి మీడియాను అలాగే అభిమానులను ఆశ్చర్యపరిచారు. అటుపై ప్రాజెక్ట్ ఆషిఖి 3 కోసం చేతులు కలుపుతున్నార‌న్న ప్ర‌చారం మ‌రోసారి ఊపందుకుంది. తాజా ఫోటోషూట్ లో కార్తీక్ ఆర్యన్- దీపికా పదుకొణె మధ్య కెమిస్ట్రీపై నెటిజ‌నులు విరుచుకుప‌డుతున్నారు. ల‌వ్ ఈమోజీల‌ను కురిపిస్తున్నారు.

దీపిక నాయికా ప్ర‌ధాన చిత్రంలో న‌టించేందుకు రెడీ అవుతోంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ప్రతిష్టాత్మక ఆషిఖీ ఫ్రాంచైజీలో మూడవ భాగంలో చేర‌డం ఖాయ‌మ‌ని గుస‌గుస‌లు స్ప్రెడ్ అయ్యాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో అధికారికంగా ప్రారంభ‌మైన ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వ‌హిస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ ని కథానాయకుడిగా ప్ర‌క‌టించినా క‌థానాయిక కోసం సుదీర్ఘ కాలం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అవార్డుల కార్యక్రమంలో దీపికా పదుకొణె - కార్తీక్ ఆర్యన్ ల స్నేహం చిరున‌వ్వులు చూశాక అభిమానులు మీడియా కూడా ఆషిఖీ 3లో దీపిక కథానాయికగా నటిస్తుందని ధృవీకరించారు. అయితే మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.  

దీపికా పదుకొనే తదుప‌రి ప్రాజెక్ట్ లు

కింగ్ ఖాన్ షారుఖ్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న‌ స్పై థ్రిల్లర్ 'పఠాన్‌'లో దీపిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇటీవలే ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫైటర్' షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో హృతిక్ రోషన్ స‌ర‌స‌న దీపిక న‌టించ‌నుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స‌ర‌స‌న‌ ప్రాజెక్ట్ K తో తెలుగు తెరకు దీపిక‌ పరిచయం కాబోతోంది. SS రాజమౌళి -మహేష్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ మూవీలోను దీపిక న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. రాజ‌మౌళి ప్ర‌స్తుతం దీపిక‌తో చర్చలు జరుపుతున్నట్లు స‌మాచారం  ఉంది.

మ‌రోవైపు యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ బ్యాక్-టు-బ్యాక్ బాక్సాఫీస్ విజయాలతో క్రౌడ్-పుల్లర్ గా మారాడు. తదుపరి సైకలాజికల్ థ్రిల్లర్ 'ఫ్రెడ్డీ'లో కనిపించనున్నాడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. అల్లు అర్జున్-నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో అధికారిక రీమేక్ అయిన షెహజాదాలోను కార్తీక్ హీరోగా న‌టిస్తున్నాడు. అతని ఇతర ప్రాజెక్ట్ లలో సత్యప్రేమ్ కీ కథ-  హేరా ఫేరి 3 -ప్యార్ కా పంచనామా 3 ఉన్నాయి. కార్తీక్ ఆర్య‌న్ లేటెస్ట్ క్రేజ్ చూస్తుంటే అత‌డు అగ్ర క‌థానాయకుల అవ‌కాశాల‌ను కొల్ల‌గొడుతున్నాడ‌ని ముంబై మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News