యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పై ఉండగానే ప్రభాస్ తన కెరీర్లో 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తుండగా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలతో పాటు అవార్డులను కూడా పొందాడు. దీంతో ప్రభాస్ చిత్రాన్ని కూడా నాగ్ అశ్విన్ అదే స్థాయిలో అద్భుతంగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇప్పటి దాకా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇంటర్నేషనల్ సినిమా కావడంతో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ యాక్టర్స్ తీసుకోనున్నారట. అలాగే వివిధ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి హాలీవుడ్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారట. ఈ సినిమా జోనర్ ఏమిటనేది మేకర్స్ వెల్లడించనప్పటికీ ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉండబోతోందట. థర్డ్ వరల్డ్ వార్ కీ పాయింట్ గా ఉండబోతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే వేయబోతున్నారట. అందుకోసమే సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. వైవిధ్యమైన అంశాలతో కూడిన స్టోరీ కాబట్టే ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాడని అనుకుంటున్నారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.