టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్.. బ్లాక్ బస్టర్స్ అనడంలో సందేహం లేదు. ఆయన బాహుబలి.. ఆర్ ఆర్ ఆర్ సినిమా లు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. ఇండియన్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం సాధ్యమా అనుకుంటున్న సమయంలో జక్కన్న బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల ను దక్కించుకున్నాడు.
ఇప్పుడు రాజమౌళి బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. గత నెల రోజులుగా రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు.
రాజమౌళి కేవలం బ్రహ్మాస్త్ర సినిమాను సమర్పించడం మాత్రమే కాకుండా ఆ సినిమా ను చూసి ఆ సినిమా ఫైనల్ ఎడిటింగ్ లో తన వంతు కత్తెర పట్టుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బ్రహ్మాస్త్ర సినిమా ను విజయేంద్ర ప్రసాద్ మరియు రాజమౌళి ఫైనల్ వర్షన్ చూసి మార్పులు చేర్పులు సూచించారని.. వాటిని నిర్మాత కరణ్ జోహార్ చేయించారని బాలీవుడ్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా బ్రహ్మాస్త్ర సినిమా స్క్రిప్ట్ సమయంలోనే దర్శకుడు రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్ లు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.
తాను స్క్రిప్ట్ లో సూచనలు చేయడం మరియు ఎడిటింగ్ లో తన మార్క్ ను చూపించడం వల్లే రాజమౌళి ఈ సినిమా పై నమ్మకంగా ఉన్నాడట. సినిమా యొక్క ఔట్ పుట్ విషయంలో రాజమౌళి చాలా సంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమాను సమర్పించేందుకు ముందుకు వచ్చాడు అంటూ సమాచారం అందుతోంది.
మొత్తానికి రాజమౌళి ఈ సినిమా కు ఏదో ఒక విధంగా తన యొక్క మద్దతు మరియు ప్రోత్సాహం ను అందించిన కారణంగా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటే రాజమౌళి గత సినిమాల స్థాయిలో వెయ్యి కోట్లు కాకున్నా కనీసం అయిదు వందల కోట్లు అయినా రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.