ట్రెండీ టాక్: దీపిక సంపాద‌న ఏడాదికి 100కోట్లు?

Update: 2023-01-06 03:38 GMT
పెళ్లి త‌ర్వాత దీపిక ప‌దుకొనే స్థాయి అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఓవైపు వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు జాతీయ అంత‌ర్జాతీయ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గాను భారీ ఆదాయం ఆర్జిస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు 15 కోట్ల నుంచి 20 కోట్ల పారితోషికం అందుకుంటున్న దీపిక పాన్ ఇండియా సినిమాల‌కు 20 కోట్లకు త‌గ్గ‌కుండా డిమాండ్ చేస్తోంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ కే' కోసం దీపిక ప‌దుకొనే 20కోట్లు డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే కింగ్ ఖాన్ షారూఖ్ స‌ర‌స‌న న‌టిస్తున్న ప‌ఠాన్ మూవీ కోసం  20కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేసింద‌ని 15 కోట్ల నుంచి 20 కోట్ల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని కూడా ముంబై మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసినా మినిమంగా 50 కోట్లు పైగా ఆర్జిస్తోందని ఓ అంచ‌నా. పాన్ ఇండియా పేరుతో ఎన్ని భాష‌ల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు? అద‌న‌పు కాల్షీట్లు ప‌ని భారాన్ని బ‌ట్టి కూడా పారితోషికం డిమాండ్ చేస్తోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

యువ‌త‌రంలో దీపిక క్రేజ్ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. దీంతో పాపుల‌ర్ బ్రాండ్లు త‌న వెంట క్యూ క‌డుతున్నాయి. దీపికా పదుకొణె జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా కొన‌సాగుతోంది. ఈ బ్రాండ్ల‌తోనే వార్షికాదాయం సుమారుగా 50 నుంచి 60 కోట్లు అందుకుంటోంద‌ని కూడా తాజాగా ముంబై మీడియా వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దీపిక పదుకొణె అంతర్జాతీయ బ్రాండ్ ల‌లో కార్టియర్.. లూయిస్ విట్టన్ .. లెవిస్ లాంటి పాపుల‌ర్ బ్రాండ్లు ఉన్నాయి. లేస్.. గార్నియర్ .. వాన్ హ్యూసెన్ వంటి అనేక భారతీయ బ్రాండ్ లకు అంబాసిడర్ గా ప‌ని చేస్తోంది. ట్విట్ట‌ర్ - ఇన్ స్టా వంటి సామాజిక మాధ్య‌మాల‌ వేదిక‌గా నిరంత‌రం ఎన్నో ప్ర‌క‌ట‌న‌ల‌ను పోస్ట్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్న న‌టిగాను దీపిక పేరు మార్మోగుతోంది.

వీటికి తోడు దీపిక పదుకొణె పరోపకారి. మానసిక ఆరోగ్య నిపుణురాలు. ప‌లు దాతృత్వ  సేవ‌ల్లోను పాలుపంచుకుంటోంది. ప్ర‌జ‌ల‌ మానసిక ఆరోగ్యం ఇతర సామాజిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వివిధ సేవా సంస్థలతో కలిసి దీపిక ప‌ని చేస్తోంది. దీపిక 37వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు త‌న‌కు బ‌ర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News