గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

Update: 2022-10-03 07:00 GMT
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కోరిక మేరకు గాడ్ ఫాదర్ సినిమాలో నటించినట్లుగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 5న విడుదల అవుతోంది. అయితే ఆ ఈవెంట్ ముందు వరకు కూడా సినిమాపై పెద్దగా భారీ స్థాయిలో అంచనాలు అయితే ఏమీ లేవు. కానీ సినిమా ట్రైలర్ తర్వాత మాత్రం కాస్త తెలుగులో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ హిందీలో సల్మాన్ ఖాన్ తరఫునుంచి ఎలాంటి హైప్ క్రియేట్ కాకపోవడం విశేషం.

వందల కోట్ల మార్కెట్ ఉన్న సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నాడు అనే హైప్ లేకపోవడంతో అక్కడ ఈ సినిమాకు పెద్దగా మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు అని తెలుస్తోంది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలాగే నైజాం ఏరియాలో భారీ స్థాయిలో ఈ సినిమాతో 22 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక సీడెడ్ 13.50 కోట్లు ధర పలికిన ఈ సినిమా ఆంధ్ర మొత్తంలో 35 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా 70.50 కోట్ల టార్గెట్ తో విడుదలవుతోంది.

ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమాకు మంచి ధర పలికినట్లు సమాచారం. అక్కడ 6:50 కోట్లు బిజినెస్ చేయగా హిందీలో రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కూడా దాదాపు అదే తరహాలో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో 7.5 కోట్లు బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే సినిమా వ్యాపారం 91 కోట్లకు చేరింది.

అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా టోటల్గా 92 కోట్లు షేర్ కలెక్షన్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక పోటీగా నాగార్జున గాడ్ ఫాదర్ సినిమా కూడా ఉంది. అలాగే బెల్లంకొండ స్వాతిముత్యం కూడా విడుదల అవుతుంది.

కానీ ఎక్కువ థియేటర్లలో గాడ్ ఫాదర్ సినిమా డామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను మెగాస్టార్ చిరంజీవి ఎంత త్వరగా పూర్తి చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News