నందమూరి బాలకృష్ణ మాస్‌యాక్షన్ ఎంటర్ టైనర్ ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన 'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో యాభై శాతం ఆక్యుపెన్సీ సిస్టిమ్ లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించి టాలీవుడ్ వర్గాలకు భారీ ఊరటని కలిగించడమే కాకుండా మరింత ధైర్యాన్ని అందించింది. ఈ మూవీ తరువాత రెట్టించిన ఉత్సాహంలో వున్న నందమూరి బాలకృష్ణ తన 107వ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు.
'క్రాక్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకుడు. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీని పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఆ మధ్య కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరించారు. ఇటీవలే చిత్ర బృందం టర్కీ వెళ్లింది. అక్కడి సుందర ప్రదేశాల్లో బాలకృష్ణ, శృతిహాసన్ లపై ఓ రొమాంటిక్ సాగ్ తో పాటు పలు కీలక సన్నివేశాలని పూర్తి చేశారు. ఇటీవలే చిత్ర బృందం హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది.
నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయాలన్నది మేకర్స్, డైరెక్టర్ ఆలోచన. అంటే రెండు నెలల్లో డిసెంబర్ నాటికి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందన్నమాట. మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన 'అఖండ' పేరుకు తగ్గట్టే అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుని బాలయ్యని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఈ సెంటమెంట్ తో మైత్రీ వారు బాలయ్య 107 మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
అయితే బాలయ్యకు మాత్రం సంక్రాంతి సెంటిమెంట్ వుందట. సంక్రాంతి బరిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ 'వాల్తేరు వీరయ్య' దిగబోతోంది. ఇప్పటికే మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అంతే కాకుండా సంక్రాంతి బరిలో ప్రభాస్ 'ఆది పురుష్' కూడా చాలా రోజుల క్రితమే జనవరి 12న వస్తున్నామంటూ ప్రకటించేశారు. ఇక ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' కూడా సంక్రాంతికే ఫిక్సయిపోయింది. ఇక అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' క్రిస్మస్ కుదరకపోతే సంక్రాంతికే రావాలనుకుంటున్నారు.
ఇన్ని సినిమాల పోటీలో బాలయ్య సినిమాని ఇరికించడం, తాము నిర్మిస్తున్న 'వాల్తేరు వీరయ్య'తో క్లాష్ కాకుండా చూసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే బాలకృష్ణ 107 సినిమాని డిసెంబర్ లో ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి జాతకాలు, సెంటిమెంట్ లు పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతూ వాటికి ప్రధాన్యతనిచ్చే బాలయ్య తన మాట నెగ్గించుకుంటాడా? లేక మైత్రీ వారి మాటే ఫైనల్ అంటాడా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.