యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సమయం రాబోతుంది. ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిపేందుకు గాను బ్రహ్మ ముహూర్తం ను ఖరారు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఆగస్టు 26వ తారీకు లాంచనంగా ప్రారంభించబోతున్నారట.
కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా సినిమా యొక్క ప్రారంభంకు మంచి ముహూర్తం లేదని కూడా యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
ఈ నెల 26వ తారీకు సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ను లాంచనంగా ప్రారంభించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.
హీరో గా ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో ఆకాశమే హద్దు అన్నట్లుగా క్రేజ్ ను దక్కించుకున్నాడు. కేవలం పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా విదేశీ మీడియా సంస్థలు కూడా కోడై కూసే విధంగా ఎన్టీఆర్ తన నటనతో కొమురం భీమ్ పాత్రకు ప్రాణం పోశాడు అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.. ఇంకా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ ను కంటిన్యూ చేసేలా ఎన్టీఆర్ 30 ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే కాస్త ఎక్కువ ఒత్తిడితో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో సినిమా కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే వచ్చి సినిమాపై అంచనాలు పెంచింది... షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయినా కూడా వచ్చే ఏడాది సమ్మర్ కు ఖచ్చితంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.