యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాన్ని ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ప్రభాస్ పాత్ర కి డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. అయితే ప్రభాస్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పలేదట.
ఇటీవల తాను డబ్బింగ్ చెప్పిన సినిమా నిరాశ పర్చడంతో ప్రభాస్ ఆదిపురుష్ కు తన సొంత డబ్బింగ్ వద్దనుకున్నాడట. అందుకే బాహుబలి సినిమా కు తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు శరద్ కేల్కర్ తోనే ఆదిపురుష్ కి కూడా డబ్బింగ్ చెప్పించారనే వార్తలు వస్తున్నాయి. సెంటిమెంట్ తో ఖచ్చితంగా ఆదిపురుష్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ లో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై ఇప్పటివరకు యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ లేదు. దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. దాంతో సినిమా విడుదల అయ్యే వరకు ఫస్ట్ లుక్ రాదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణం ఇతి వృత్తంలో రూపొందిన ఆదిపురుష్ లో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. సినిమా పై ఉన్న అంచనాలతో ఇది ఒక అద్భుతమైన మోషన్ గ్రాఫిక్స్ మూవీ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను ఖర్చు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. కనుక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్య ల్లో భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ప్రభాస్ కి జోడీగా సీత పాత్రలో ఈ సినిమాలో కృతి సనన్ నటించిన విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.