అగ్ర నిర్మాత అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నాగి.. రెండో సినిమా 'మహానటి' తో నేషనల్ అవార్డ్ అందుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
దర్శకుడుగా ఒక్క సినిమా అనుభవంతో అలనాటి నటి సావిత్రి బయోపిక్ ని ఎలా తీయగలడని సందేహించిన వారందరూ ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకొని మరోసారి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''ప్రాజెక్ట్ K''. ఇది మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందే సూపర్ హీరో మూవీ అని తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులకు సరికొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి టీమ్ అంతా తీవ్రంగా కష్టపడుతోంది.
"ప్రాజెక్ట్ K" చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించినట్లు టాక్. హాలీవుడ్ సినిమాల స్థాయిలో అత్యున్నత సాంకేతికతతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని మేకర్స్ ప్రకటించారు. అందుకే నాగ్ అశ్విన్ అండ్ టీమ్ చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. ప్రతీది కొత్తగా క్రియేట్ చేయాల్సి రావడం.. ఎంతో శ్రమతో కూడుకున్నది కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులకే ఏడాదిన్నర సమయం తీసుకున్నారు.
2020 ఫిబ్రవరిలో 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించగా.. 2021 జూలైలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ప్రతీది ఇనిషియల్ స్టేజీ నుంచి నేర్చుకొని తెరకెక్కించాల్సి రావడంతో.. చిత్ర బృందానికి కూడా కొత్తగా ఉంటోందని తెలుస్తోంది.
ఇటీవల నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ K సినిమా పూర్తిగా కొత్తదని.. స్క్రిప్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అన్నారు. 'మహానటి' కి కార్లను అద్దెకు తీసుకువచ్చి షూట్ చేసినట్లుగా ఈ చిత్రానికి చేయలేమని.. ఎందుకంటే ఇందులో ఉపయోగించడానికి కావాల్సిన వెహికల్స్ ఎక్కడా దొరకవని.. తామే తయారు చేసుకుంటున్నామని.. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
మొత్తం మీద నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ కోసం న్యూ వరల్డ్ ని క్రియేట్ చేయడానికి.. ప్రేక్షకులకు విజువల్ వండర్ ని అందించడానికి చాలా కష్టపడుతున్నారని అర్థమవుతుంది. ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. ప్రభాస్ తో పాటుగా నాగ్ అశ్విన్ క్రేజ్ కూడా ఖండాలు దాటుతుంది.
'ప్రాజెక్ట్-K" సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. దిగ్గజ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2024 దసరాకి లేదా 2025 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.