అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంది. గత ఏడాది ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా గా నిలిచిన విషయం తెల్సిందే.
పుష్ప సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పుష్ప 2 పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 మూడు నాలుగు రెట్ల అదనపు వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.
పుష్ప సినిమా ను కూడా కేజీఎఫ్ రేంజ్ లోనే జనాలు భావిస్తున్నారు. అందుకే కేజీఎఫ్ 2 కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ను చేయాలి.. ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అనేది సుకుమార్ మరియు ఇతర యూనిట్ సభ్యుల ప్లాన్. అందులో భాగంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ ను కూడా ది బెస్ట్ అన్నట్లుగా తీసుకు వచ్చేందుకు సుకుమార్ టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
స్క్రిప్ట్ వర్క్ కోసం దాదాపుగా ఆరు ఏడు నెలల సమయం తీసుకున్న సుకుమార్ ఇంకా పినిషింగ్ టచ్ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరో వైపు పుష్ప 2 సినిమా యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ లో దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా తాజాగా పాల్గొన్నాడు.
పుష్ప పాటలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట కూడా.. ఆ మాటకు వస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా పుష్ప పాటలు మారుమ్రోగాయి. అందుకే పుష్ప 2 పాటలు కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా పుష్ప 2 కోసం రెడీ అయిన పాటలను విన్న బన్నీ మరియు సుకుమార్ లు చాలా సంతృప్తి చెందారట. త్వరలోనే ఆ పాటల రికార్డింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా ప్రారంభానికి ముందు రెండు మూడు పాటలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 కోసం దేవి శ్రీ ప్రసాద్ వాయింపు మరో లెవల్ లో ఉంటుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.