RC15 : సెకండ్‌ రోల్‌ మరో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్

Update: 2022-12-24 05:53 GMT
రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చకచక జరుగుతోంది. ఇటీవలే కొత్త షెడ్యూల్‌ ను వైజాగ్ లో ప్రారంభించారు. దాదాపుగా రెండు నుండి మూడు వారాల పాటు ఈ షెడ్యూల్‌ ను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇటీవలే ఒక విదేశాల్లో అత్యంత ఖరీదైన పాటను చిత్రీకరించారు.

ఇప్పుడు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆ రెండవ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ ను చిత్రీకరణ చేస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్ల్యాష్ బ్యాక్‌ ఎపిసోడ్స్ లో రామ్‌ చరణ్ ఒక సాదారణ నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఒక పార్టీ నాయకుడిగా రామ్‌ చరణ్ పాత్రలో కనిపించబోతున్నాడని... అందుకు సంబంధించిన పార్టీ మీటింగ్‌ సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారట.

దాదాపుగా వెయ్యి నుండి పదిహేను వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ చిత్రీకరణ సాగుతుందట. ప్రస్తుతం జరుగుతున్న సభ సన్నివేశాలను త్వరలోనే ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఆ సభ సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. రెండవ రామ్‌ చరణ్ పాత్రకు గాను జోడీగా అంజలి నటిస్తోంది. ఇప్పటికే లీక్ అయిన ఫొటోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శంకర్ సినిమా అంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News